LOADING...
US: ఐఆర్‌జీసీ ఆర్థిక వనరుల సమాచారం ఇస్తే.. అమెరికా145 కోట్ల భారీ నగదు బహుమతి 
ఐఆర్‌జీసీ ఆర్థిక వనరుల సమాచారం ఇస్తే.. అమెరికా145 కోట్ల భారీ నగదు బహుమతి

US: ఐఆర్‌జీసీ ఆర్థిక వనరుల సమాచారం ఇస్తే.. అమెరికా145 కోట్ల భారీ నగదు బహుమతి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితం చూపడం లేదు. యుద్ధం ముగిసేలా వాషింగ్టన్‌ చేసిన ప్రతిపాదనలకు టెహ్రాన్‌ నుంచి అంగీకారం లభించకపోవడంతో చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది.ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ సంస్థకు ఆర్థిక సహాయం అందిస్తున్న వనరులపై సమాచారం ఇచ్చిన వారికి రూ.145 కోట్ల వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించింది. ఐఆర్‌జీసీకి,దాని అనుబంధ విభాగాలకు నిధులు సమకూరుస్తున్న బినామీ సంస్థలు,వ్యక్తులు,ఆర్థిక సంస్థల వివరాలను తమకు తెలియజేయాలని అమెరికా కోరింది. గల్ఫ్ దేశాలపై దాడులు చేయకుండా అడ్డుకోవడం,అలాగే ఇరాన్ అణు కార్యక్రమాలకు ఆర్థికంగా దెబ్బతీయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐఆర్‌జీసీ ఆర్థిక వనరులపై అమెరికా దృష్టి

Advertisement