Loading...
Iranian airlines: ఇరాన్‌ విమానాలకు గ్లోబల్‌ షట్‌డౌన్‌.. హెచ్చరించిన అమెరికా
ఇరాన్‌ విమానాలకు గ్లోబల్‌ షట్‌డౌన్‌.. హెచ్చరించిన అమెరికా

Iranian airlines: ఇరాన్‌ విమానాలకు గ్లోబల్‌ షట్‌డౌన్‌.. హెచ్చరించిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2026
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వాషింగ్టన్ మరో కీలక చర్యకు సిద్ధమైంది. ఇరాన్ విమానయాన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా నిలువరించేలా ఆంక్షలు అమలు చేయనున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. సెప్టెంబర్ 23 నుంచి ఇరాన్‌కు చెందిన అన్ని వాణిజ్య విమానయాన సంస్థల అంతర్జాతీయ కార్యకలాపాలు నిలిచిపోతాయని ఆయన తెలిపారు.

వివరాలు 

విమాన సేవలు కొనసాగిస్తే ఆంక్షలు

ఇరాన్ విమానాలకు విదేశీ విమానాశ్రయాలు సేవలు అందించకుండా చూడటమే ఈ చర్య లక్ష్యమని బెసెంట్ స్పష్టం చేశారు.

ఇరాన్ విమానాలు ఏదైనా దేశంలో దిగితే వాటికి ఇంధనం సరఫరా చేయడం, ల్యాండింగ్ సేవలు కల్పించడం, టికెట్లు విక్రయించడం వంటి కార్యకలాపాలు చేపట్టే సంస్థలపై కూడా అమెరికా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

అలాంటి సంస్థలు అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు దూరమయ్యే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

వివరాలు 

ఇతర దేశాలపైనా ఒత్తిడి

ఇరాన్ విమానయాన రంగానికి సహకరించే విదేశీ కంపెనీలు, విమానాశ్రయాలు, ఇంధన సరఫరాదారులు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలు, టికెటింగ్ ఏజెన్సీలు కూడా అమెరికా ద్వితీయ ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

దీంతో ఇరాన్ విమానాలు అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సేవలను పొందడం మరింత కష్టతరం కానుంది.

ఇప్పటికే కొన్ని దేశాల్లో ఇరాన్ విమానాలపై ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి.

జార్జియాలో అమెరికా ఆంక్షలకు గురైన ఇరాన్ విమానయాన సంస్థల విమాన సేవలు సెప్టెంబర్ 21 నుంచి నిలిచిపోయినట్లు సమాచారం.

మరోవైపు ఇరాక్ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 22 నుంచి ఇరాన్ విమానయాన సంస్థల సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

విమాన ప్రయాణికులపై ప్రభావం

ఇరాన్‌కు వెళ్లే, అక్కడి నుంచి ఇతర దేశాలకు వచ్చే ప్రయాణికులకు ఈ పరిణామాలు ఇబ్బందులను పెంచే అవకాశం ఉంది.

ఇప్పటికే పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇరాన్‌కు తమ సేవలను నిలిపివేశాయి.

దీంతో అందుబాటులో ఉన్న విమాన మార్గాలు తగ్గిపోతున్నాయి. ప్రత్యామ్నాయంగా కొందరు ప్రయాణికులు పొరుగు దేశాలకు విమానాల్లో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇరాన్ చేరుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

27 ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలు

తాజా చర్యలకు ముందు సెప్టెంబర్ 8న అమెరికా ఆర్థిక శాఖ ఇరాన్ విమానయాన రంగానికి చెందిన 27 విమానయాన సంస్థలు సహా మొత్తం 36 సంస్థలు, వ్యక్తులు, సంబంధిత నెట్‌వర్క్‌లపై ఆంక్షలు విధించింది.

ఇరాన్ విమానయాన రంగం ఆయుధాలు, సైనిక సిబ్బంది, అక్రమ సరుకు రవాణాకు ఉపయోగపడుతోందని అమెరికా పేర్కొంది.

ఇరాన్ విమానయాన రంగంపై ఒత్తిడి పెంచడంతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయంగా మరింత ఒంటరిచేయడానికి అమెరికా చర్యలు విస్తరిస్తోంది.

వివరాలు 

27 ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలు

ఆర్థిక, విమానయాన, నౌకా రవాణా తదితర రంగాలపై ఒత్తిడి పెంచే చర్యలను వాషింగ్టన్ కొనసాగిస్తోంది.

ఇరాన్ విమానయాన సంస్థలపై ప్రకటించిన తాజా ఆంక్షలపై టెహ్రాన్ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

సెప్టెంబర్ 23 నుంచి విదేశీ విమానాశ్రయాలు, సేవా సంస్థలు అమెరికా హెచ్చరికలను ఎలా అమలు చేస్తాయన్నది ఇరాన్ అంతర్జాతీయ విమాన కార్యకలాపాలపై కీలక ప్రభావం చూపనుంది.

ADVERTISEMENT