Loading...
Harvard University: అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు.. హార్వర్డ్ విద్యార్థులకు సూచనలు
అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు.. హార్వర్డ్ విద్యార్థులకు సూచనలు

Harvard University: అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు.. హార్వర్డ్ విద్యార్థులకు సూచనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎఫ్-1, జే-1 వీసాలకు సంబంధించి అమెరికా జాతీయ భద్రతా శాఖ తీసుకువస్తున్న కొత్త మార్గదర్శకాలపై ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ తన అంతర్జాతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. విదేశీ ప్రయాణాల్లో ఉన్న విద్యార్థులు, పరిశోధకులు ఆలోగా అమెరికాకు తిరిగి చేరుకోవాలని సూచించింది.

వివరాలు 

డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానానికి స్వస్తి..

ప్రస్తుతం విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు నిర్దిష్ట గడువు లేకుండా అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించే 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానం అమల్లో ఉంది.

అయితే కొత్త నిబంధనల్లో ఈ విధానాన్ని తొలగించనున్నారు.

దాని స్థానంలో గరిష్ఠంగా నాలుగేళ్ల కాలపరిమితి ఉండే విధానాన్ని తీసుకురానున్నారు.

లేదా విద్యార్థి కోర్సు పూర్తయ్యే వ్యవధికి అనుగుణంగా నిర్దిష్ట ముగింపు తేదీని వీసా నిబంధనల్లో పేర్కొంటారు.

వివరాలు 

అమెరికాలో ఉన్న విద్యార్థులకు కొంత మినహాయింపు..

ఇప్పటికే అమెరికాలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు కొత్త నిబంధనల నుంచి కొంత మినహాయింపు లభించనుంది.

అయితే సెప్టెంబర్ 15 తర్వాత అమెరికా వెలుపలికి ప్రయాణించి తిరిగి దేశంలోకి ప్రవేశించే విద్యార్థులకు మాత్రం కొత్త నిబంధనలే వర్తిస్తాయి.

దీంతో ప్రయాణాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు సెప్టెంబర్ 15లోగా క్యాంపస్‌కు చేరుకోవాలని హార్వర్డ్ సూచించింది.

నాలుగేళ్లు దాటితే ప్రత్యేక అనుమతి తప్పనిసరి..

కొన్ని కోర్సులను పూర్తి చేయడానికి నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం అవసరమయ్యే విద్యార్థులు అదనపు గడువు కోసం యూఎస్‌సీఐఎస్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది.

నిర్దేశిత కాలపరిమితి దాటిన తర్వాత అమెరికాలో ఉండేందుకు ప్రత్యేకంగా పొడిగింపు కోరాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన అనుమతులు కొత్త నిబంధనల ప్రకారం పొందాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

గ్రేస్ పీరియడ్‌లోనూ మార్పులు..

విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసిన తర్వాత అమెరికాను విడిచిపెట్టేందుకు ప్రస్తుతం లభించే గ్రేస్ పీరియడ్‌లోనూ మార్పులు చేయనున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువును తగ్గించే అవకాశం ఉంది.

దీంతో కోర్సు పూర్తయ్యే సమయం, వీసా గడువు, అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సిన కాలపరిమితిపై అంతర్జాతీయ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ADVERTISEMENT