USA: డ్రోన్‌ల వెలుగుల్లో అమెరికా.. 250 ఏళ్ల చరిత్రకు అద్భుత రూపం..
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 03, 2026
04:58 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా తన స్వాతంత్య్రాని..కి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా ఫిలడెల్ఫియా నగరంలో ఏర్పాటు చేసిన డ్రోన్ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వందల సంఖ్యలో డ్రోన్లు సమన్వయంతో ఆకాశంలో విహరిస్తూ రంగురంగుల కాంతులతో అమెరికా చరిత్రలోని కీలక ఘట్టాలను అద్భుతంగా ప్రతిబింబించాయి. గత రెండున్నర శతాబ్దాల కాలంలో దేశం సాధించిన ప్రగతి, విజయాలు, చారిత్రక మైలురాళ్లను ఈ వినూత్న ప్రదర్శన కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించింది.