Venezuela earthquake: వెనెజువెలాను కుదిపేసిన వరుస భూకంపాలు.. మృతుల సంఖ్య లక్షకు చేరొచ్చని యూఎస్‌జీఎస్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ ప్రకృతి విపత్తు ప్రభావంతో రాజధాని నగరంలో భారీ స్థాయిలో విధ్వంసం చోటుచేసుకుంది. అనేక బహుళ అంతస్తుల భవనాలు కూలిపోగా, శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంపాల అనంతరం మరిన్ని బలమైన ప్రకంపనలు సంభవించే అవకాశముందని, పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ (USGS) తెలిపింది. ఈ విపత్తులో మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశం ఉందని యూఎస్‌జీఎస్ అంచనా వేసింది.
వివరాలు
ఇళ్లను ఖాళీ చేయాలని సూచన
అయితే ఇప్పటివరకు వెనెజువెలా ప్రభుత్వం అధికారికంగా మరణాల సంఖ్యను ప్రకటించలేదు. మరోవైపు భూకంపాల కారణంగా గాయపడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వెనెజువెలా ప్రభుత్వం సూచించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇళ్లకు సరఫరా అవుతున్న పెట్రోల్‌ను నిలిపివేసినట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని భవనాలు కూలిపోవడంతో మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వివరించింది.
వివరాలు
జాతీయ సెలవుదినం కావడంతో ఇళ్లలోనే ఎక్కువ మంది
జూన్ 24 వెనెజువెలాలో జాతీయ సెలవుదినం కావడంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్లలోనే ఉన్నారు. నిన్న సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో తొలి భూకంపం సంభవించగా, భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాతీయ సెలవు కారణంగా ఎక్కువ మంది ఇళ్లలో ఉండటం కూడా ప్రాణనష్టం పెరగడానికి ఒక కారణంగా మారి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విపత్తులో మరణాల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని వెనెజువెలా అధ్యక్షురాలు రోడ్రిగ్స్ కూడా తన సందేశంలో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వెనెజువెలాలో వరుస భూకంపాలు.. భారీ ప్రాణనష్టంపై యూఎస్‌జీఎస్ హెచ్చరిక
Additional footage of the major damage in La Guaira, Venezuela from the powerful earthquakes. pic.twitter.com/TuWjpBblnF
— AZ Intel (@AZ_Intel_) June 25, 2026