Viral Video: అమెరికాలో సంచలనం.. ల్యాండింగ్ సమయంలో ట్రక్‌ను ఢీకొట్టిన బోయింగ్ 767.. తప్పించుకున్న డ్రైవర్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజీగా ఉండే న్యూజెర్సీ టర్న్‌పైక్‌పై వెళ్తున్న ఓ బేకరీ ట్రక్‌ను ల్యాండింగ్ అవుతున్న బోయింగ్ 767 విమానం తాకింది. ఈ ఘటనలో డ్రైవర్ వారెన్ బోర్డ్లీ జూనియర్ అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం ల్యాండింగ్ గేర్ టైరు ట్రక్ గాజును పగులగొట్టి లోపలికి దూసుకెళ్లడంతో ఆయన చేతికి, భుజానికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే షాక్‌లో ఉన్న ఆయన తన తండ్రికి ఫోన్ చేశాడు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుతం ఇంట్లో చికిత్స పొందుతున్న డ్రైవర్.. ఇకపై లారీ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఘటనపై అమెరికా రవాణా భద్రతా సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వగా,ప్రయాణికులు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రాణాల మీదికి వచ్చిన విమానం.. తప్పించుకున్న డ్రైవర్
Insane NEW footage of the United Airlines Boeing 767 that recently hit a truck at Newark with a tire, shattering at least one window and injuring the driver, Warren Boardley.
— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) May 5, 2026
Why are airports allowed to be built so close to active roads?
So dangerous! pic.twitter.com/ANdzcKh3ws