Page Loader
గాజాలో బంధీగా ఉన్న ఇజ్రాయెల్ యువతి వీడియోను రిలీజ్ చేసిన హమాస్ 
గాజాలో బంధీగా ఉన్న ఇజ్రాయెల్ యువతి వీడియోను రిలీజ్ చేసిన హమాస్

గాజాలో బంధీగా ఉన్న ఇజ్రాయెల్ యువతి వీడియోను రిలీజ్ చేసిన హమాస్ 

వ్రాసిన వారు Stalin
Oct 17, 2023
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్లు పలువురు ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా పట్టుకున్నారు. ఈ క్రమంలో గాజా స్ట్రిప్‌లో బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల వీడియోను హమాస్ మిలిటెంట్లు విడుదల చేసినట్లు జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఓ యువతి చేయి విరగడంతో వైద్యం పొందుతున్న దృశ్యాలు హమాస్ రిలీజ్ చేసిన వీడియోలో కనపడుతుంది. బంధీగా ఉన్న ఆ యువతి తాను ఇజ్రాయెల్‌లోని షోహమ్‌కు చెందిన 21 ఏళ్ల మియా షెమ్‌గా వీడియోలో పరిచయం చేసుకుంది. తనను హమాస్ మిలిటెంట్లు జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు పేర్కొంది. తన చేయి విరిగిన తర్వాత గాజాలో శస్త్రచికిత్స చేయించుకున్నానని, వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఆ యువతి పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హమాస్ విడుదల చేసిన వీడియో