తదుపరి వార్తా కథనం
Greenland: మేం అమెరికన్లం కాదు.. గ్రీన్‌లాండ్ పార్టీల స్పష్టమైన ప్రకటన
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 10, 2026
03:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఘటన అనంతరం గ్రీన్‌లాండ్ పేరు అంతర్జాతీయంగా మరింతగా చర్చకు వచ్చింది. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైతే సైనిక మార్గాన్ని కూడా పరిశీలించవచ్చని ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌లోని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. తాము అమెరికన్లుగా మారాలనుకోవడం లేదని, తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు పూర్తిగా తమకే ఉందని అవి స్పష్టంగా ప్రకటించాయి. ఈ మేరకు జారీ చేసిన ప్రకటనపై గ్రీన్‌లాండ్ రాజకీయ పార్టీల నేతలు సంతకాలు చేశారు. గ్రీన్‌లాండ్ భవిష్యత్తును ఈ ద్వీప ప్రజలే నిర్ణయిస్తారని, బయటి జోక్యాన్ని అంగీకరించబోమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.