LOADING...
Iran: ట్రంప్‌ పోస్టుతో వేడెక్కిన పశ్చిమాసియా.. హైఅలర్ట్‌లో ఇజ్రాయెల్
ట్రంప్‌ పోస్టుతో వేడెక్కిన పశ్చిమాసియా.. హైఅలర్ట్‌లో ఇజ్రాయెల్

Iran: ట్రంప్‌ పోస్టుతో వేడెక్కిన పశ్చిమాసియా.. హైఅలర్ట్‌లో ఇజ్రాయెల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో (Iran Protests) గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన సోషల్ మీడియా పోస్టు తీవ్ర దుమారం రేపింది. తమపై అమెరికా దాడికి పాల్పడితే ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ కూడా తమ లక్ష్యాలుగా మారతాయని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ఇరాన్ కరెన్సీ రియాల్ తీవ్రంగా పతనం కావడం, జీవన వ్యయాలు విపరీతంగా పెరగడం వంటి కారణాలతో డిసెంబర్ 28 నుంచి ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Details

అమెరికా జోక్యంపై తీవ్ర అభ్యంతరం

ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. "ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది. వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందంటూ నిరసనకారులకు మద్దతుగా పోస్టు చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించిన సభ్యులు, అమెరికా జోక్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Details

 2023లో ఇజ్రాయెల్‌పై దాడులు

సభలో పలువురు ఎంపీలు అమెరికాకు వ్యతిరేకంగా, సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇక ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. గతంలో ఇరాన్ మద్దతు ఉన్న హమాస్ మిలిటెంట్లు 2023లో ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అలాగే హెజ్‌బొల్లాతో కూడా ఇజ్రాయెల్ ఘర్షణలు ఎదుర్కొంది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరుగుతుందనే ఆందోళన అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది.

Advertisement