Page Loader
Green Card Lottery: అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ అంటే ఏంటి? భారతీయులకు అవకాశం ఉందా?
అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ అంటే ఏంటి? భారతీయులకు అవకాశం ఉందా?

Green Card Lottery: అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ అంటే ఏంటి? భారతీయులకు అవకాశం ఉందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇమ్మిగేషన్ రేటు తక్కువగా ఉన్న దేశాల ప్రజలకు అమెరికా అందించే డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా (DV Program) గ్రీన్ కార్డ్ లాటరీగా గుర్తింపు పొందింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి సంవత్సరం 55,000 మందికి శాశ్వత నివాస అనుమతి (Green Card) లభించే అవకాశం ఉంటుంది. దీనిని అమెరికా విదేశాంగశాఖ నిర్వహిస్తుంది. ఫీజు లేకుండా రాండమ్ డ్రా పద్ధతిలో ఎంపిక చేసే ఈ లాటరీ గురించి పూర్తి వివరాలు ఇవే..

Details

గ్రీన్ కార్డ్ లాటరీ అంటే ఏమిటి? 

ప్రారంభం: 1990లో ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ప్రకారం ప్రారంభం. నిర్వహణ: అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతి ఏడాది: 55,000 మందికి గ్రీన్ కార్డులు అందజేస్తారు ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? కంప్యూటర్ ఆధారిత రాండమ్ డ్రా ద్వారా ఎంపిక. లాటరీకి నమోదు అక్టోబర్‌లో ప్రారంభమై నవంబర్‌లో ముగుస్తుంది. ఎంపికైన వారికి వెంటనే గ్రీన్ కార్డ్ రాదు - ఇంకా ప్రక్రియ ఉంది.

Details

ఎంపికైన తర్వాత చేసే ప్రాసెస్ 

1. ఇంటర్వ్యూ: అమెరికా రాయబార కార్యాలయంలో అధికారులతో ముఖాముఖీ. 2. మెడికల్ చెకప్: ఆరోగ్యపరీక్ష తప్పనిసరి. 3. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్: భద్రతా కారణాల నిమిత్తం. గమనించాల్సిన ముఖ్య విషయాలు గత 5 ఏళ్లలో 50,000 మందికిపైగా వలసదారులు పంపిన దేశాల అభ్యర్థులు ఈ లాటరీకి అర్హులు కాదు. ఒక్క వ్యక్తి ఒక్క అప్లికేషన్ మాత్రమే సమర్పించాలి - ఎక్కువగా వేస్తే అనర్హత వస్తుంది. కేవలం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారానే అప్లై చేయాలి. మోసపూరిత వెబ్‌సైట్లు, మాధ్యమాలను దూరంగా ఉంచాలి.

Details

భారతీయులకు లాటరీ అవకాశం ఉందా?

ఈ లాటరీలో భారత్‌కు అర్హత లేదు, ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువ మంది అమెరికా వస్తుండటం వల్ల. కానీ అర్హత ఉన్న దేశాల్లో పుట్టిన భారతీయులు మాత్రం అప్లై చేయవచ్చు. DV లాటరీకి అర్హత ఉన్న కొన్ని దేశాలు అల్జీరియా, అంగోలా, బెనిన్, బోట్స్‌వానా, ఈజిప్ట్, ఎథియోపియా, కెన్యా,లెసోతో, లైబీరియా, మడగాస్కర్,మాలావి, మాలీ, మారిషస్, మొరాకో, నైజర్, నైజీరియా, రువాండా, సూడాన్,దక్షిణాఫ్రికా, ఉగాండా, జింబాబ్వే, ఇతర అఫ్రికన్ దేశాలు. అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ అనేది కనీస వలస రేటు ఉన్న దేశాల వాసులకు శాశ్వత నివాస హోదా కల్పించే అవకాశం. భారతీయులకు ఇది అందుబాటులో లేకపోయినా, అర్హత ఉన్న ఇతర దేశాల్లో జన్మించిన భారతీయులు మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.