Loading...
Gaza: గాజాలో శాంతి పవనాలు.. ఆయుధాలు వీడేందుకు హమాస్‌ అంగీకారం!
గాజాలో శాంతి పవనాలు.. ఆయుధాలు వీడేందుకు హమాస్‌ అంగీకారం!

Gaza: గాజాలో శాంతి పవనాలు.. ఆయుధాలు వీడేందుకు హమాస్‌ అంగీకారం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిన గాజాలో శాంతి నెలకొనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఆయుధాలను విడిచిపెట్టేందుకు హమాస్‌ అంగీకరించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. అయితే గాజా నుంచి ఇజ్రాయెల్‌ తన సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్న తర్వాతే తాము ఆయుధాలు అప్పగిస్తామని హమాస్‌ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉండగా హమాస్‌ నిరాయుధీకరణ, గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ బలగాల ఉపసంహరణపై ఒక కీలక అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

వివరాలు

ఒప్పందం దశలవారీగా అమలవుతుంది

ఈ మేరకు ఆయన తన సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ, ఈ ఒప్పందం ముందుగా నిర్ణయించిన దశలవారీ విధానంలో అమలవుతుందని పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదన అమలైతే, మూడేళ్లుగా రక్తపాతం సృష్టించిన ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణకు ముగింపు పలికి, గాజాలో శాంతి పునరుద్ధరణకు మార్గం సుగమం కానుందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT