Loading...
American Airlines: విమానంలో నగ్నంగా తిరుగుతూ మహిళ హల్‌చల్‌.. ల్యాండ్‌ కాగానే అరెస్టు
విమానంలో నగ్నంగా తిరుగుతూ మహిళ హల్‌చల్‌.. ల్యాండ్‌ కాగానే అరెస్టు

American Airlines: విమానంలో నగ్నంగా తిరుగుతూ మహిళ హల్‌చల్‌.. ల్యాండ్‌ కాగానే అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమానంలో మహిళ ప్రయాణికురాలు దుస్తులు తొలగించి, గట్టిగా అరుస్తూ అటూఇటూ తిరగడంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానం గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 11న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు 

విమానంలో అసౌకర్య పరిస్థితులు

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 160 మంది ప్రయాణికులతో బాల్టిమోర్‌ నుంచి మియామీకి బయల్దేరింది.

కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఓ మహిళా ప్రయాణికురాలు తన దుస్తులు తొలగించి, గట్టిగా అరుస్తూ విమానంలో అటూఇటూ తిరగడం ప్రారంభించింది.

దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

వివరాలు 

గమ్యస్థానంలో పోలీసులకు అప్పగింత

పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమెను బలవంతంగా సీట్‌లో కూర్చోబెట్టి.. పైలట్లకు సమాచారం అందించారు.

అలాగే మియామీ విమానాశ్రయ సిబ్బందికి, ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యానికి ఘటన గురించి తెలియజేశారు.

విమానాన్ని వెనక్కి మళ్లించకుండా ప్రయాణాన్ని కొనసాగించాలని సిబ్బంది నిర్ణయించారు.

మియామీ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఆ మహిళను పోలీసులకు అప్పగించారు.

ఆమె అలా ప్రవర్తించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ADVERTISEMENT