Page Loader
Brazil: ఆ దేశంలో 'ఎక్స్' సేవలు నిలిపివేత 
ఆ దేశంలో 'ఎక్స్' సేవలు నిలిపివేత

Brazil: ఆ దేశంలో 'ఎక్స్' సేవలు నిలిపివేత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2024
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్‌లో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈమేరకు ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్‌ డె మోరాసే ఆదేశాల మేరకు టెలికాం శాఖ ఈ చర్యలు తీసుకుంది. దీంతో ఆ దేశంలో ఎక్స్‌ యాప్‌లోకి ప్రజలు లాగిన్‌ కావడం అసాధ్యమైంది. సుప్రీంకోర్టు ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న ఖాతాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఎక్స్‌ బ్రెజిల్‌లో న్యాయ ప్రతినిధిని నియమించకపోవడంతో, న్యాయమూర్తి డె మోరాసే ఎక్స్‌ను 24 గంటల్లో ఆపేయాలని ఆదేశించారు. టెక్ దిగ్గజాలు యాపిల్‌, గూగుల్‌లకు ఐదు రోజుల గడువు విధించారు.

Details

రాజకీయ లబ్ధి కోసం నాశనం చేస్తున్నారని మండిపడ్డ ఎలాన్ మస్క్

ఈ లోపే ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ అప్లికేషన్ల నుంచి ఎక్స్‌ను తొలగించాలని సూచించారు. అలాగే, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సాయంతో ఎక్స్‌లో లాగిన్‌ అయిన వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు 5,000 డాలర్ల ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎక్స్‌ బ్రెజిల్‌లో న్యాయ ప్రతినిధిని నియమించే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామంపై ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. వాక్‌స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది అని, అయితే, ప్రజామోదంతో ఎన్నిక కాని న్యాయమూర్తి ఈ పునాదిని రాజకీయ లబ్ధి కోసం నాశనం చేస్తున్నారని విమర్శించారు.