Zelenskyy: ట్రంప్‌తో డీల్‌కూ సిద్ధమే.. జెలెన్‌స్కీ "కృతజ్ఞత" వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య ఇటీవల మీడియా ఎదుట జరిగిన వాగ్వాదం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ట్రంప్‌తో భేటీ వివాదాస్పదంగా మారడంతో ఆ సమావేశాన్ని మధ్యలోనే ముగించి జెలెన్‌స్కీ బయటకు వెళ్లిపోయారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, తాజాగా ఆయన అమెరికాతో సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాతో ఒప్పందానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అంతేకాకుండా, ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ అమెరికాకు రుణపడి ఉంటారని పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు.
వివరాలు
లండన్‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం
ఉక్రెయిన్-రష్యా యుద్ధ ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం జరిగింది, ఇందులో జెలెన్‌స్కీ పాల్గొన్నారు.
అనంతరం, తాజా పరిణామాలపై స్పందిస్తూ, ''అమెరికాతో మైత్రిని కొనసాగించగలను. నిర్మాణాత్మక సంభాషణ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానిస్తే మరల భేటీకి సిద్ధంగా ఉంటా. తీవ్రమైన, అసలైన సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ నేను సిద్ధమే. ఖనిజాల ఒప్పందంపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే, దానిపై సంతకం చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను'' అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.