
Ukraine: రష్యాతో చర్చలకు సిద్ధం.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌తో రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక మార్పులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు.
ఇస్తాంబుల్‌ను చర్చల వేదికగా పుతిన్ సూచించిన విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించకపోయినా, 'రష్యా ఎట్టకేలకు ఈ యుద్ధానికి ముగింపు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటోందని తెలిపారు.
ప్రపంచం అంతా దీన్నే కోరుతూ ఎదురు చూస్తోందని జెలెన్‌స్కీ అన్నారు. ఈ యుద్ధాన్ని నిలిపేయడంలో తొలి అడుగు కాల్పుల విరమణేనని స్పష్టం చేశారు.
ఇలాంటి మానవ విపత్తును ఒక్కరోజు కూడా కొనసాగించడంలో అర్థం లేదని తెలిపారు. ప్రస్తుతం రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన విషయం పట్ల స్పష్టత కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
Details
ఇస్తాంబుల్ లో చర్చలు
రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇందుకు స్పందనగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కీవ్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధతను ప్రకటించారు.
చర్చల వేదికగా ఇస్తాంబుల్‌ను పేర్కొన్నారు. ఈ చర్చల ద్వారా సంపూర్ణ కాల్పుల విరమణ అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఇప్పటికే మానవతా దృక్పథంతో ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన వనరులపై దాడులను నిలిపివేశామని, ఈస్టర్ విరమణ, విక్టరీ డే కాల్పుల విరమణ వంటి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఇక రష్యా సోమవారం ప్రారంభించనున్న 30 రోజుల కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే, తాము మరింత కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో పాటు పలువురు యూరోప్ నేతలు హెచ్చరించారు.