LOADING...
Zero-tolerance policy: CCP-సంబంధిత మహిళతో రొమాన్స్‌.. అమెరికా దౌత్యవేత్తపై వేటు 
CCP-సంబంధిత మహిళతో రొమాన్స్‌.. అమెరికా దౌత్యవేత్తపై వేటు

Zero-tolerance policy: CCP-సంబంధిత మహిళతో రొమాన్స్‌.. అమెరికా దౌత్యవేత్తపై వేటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా మహిళతో ప్రేమ వ్యవహారాన్నినడిపి దాచిపెట్టిన ఒక అమెరికా దౌత్యవేత్తను తొలగించినట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. ఆ మహిళపై గూఢచర్య చర్యలకు సంబంధించిన ఆరోపణలున్ననేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. ఈ విషయాన్ని యూఎస్‌ విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటికే చైనీయులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోవడాన్ని నిషేదించిన సంగతి తెలిసిందే. ఆ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ దౌత్యవేత్తను తొలగించినట్లు తెలుస్తోంది. టామీ పిగోట్ ప్రకటన ప్రకారం,ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమీక్ష జరిపారని తెలిపారు. ఆసమీక్షలో గూఢచర్య ఆరోపణలకు గురైన చైనా మహిళతో దౌత్యవేత్త ప్రేమ వ్యవహారం నడిపి దానిని దాచిపెట్టిన విషయం నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.

వివరాలు 

చైనాలో పనిచేస్తున్న సిబ్బందికి గతంలోనే కీలక హెచ్చరికలు

ఈ కారణంగా ఆయనపై కఠిన చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. విదేశాంగ కార్యదర్శి రూబియో నాయకత్వంలో అమెరికా ప్రభుత్వం దేశ జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఏ ఉద్యోగి అయినా వదిలిపెట్టదని దృఢంగా నిర్ణయించిందని పిగోట్ తెలిపారు. అయితే, ఆ దౌత్యవేత్త పేరును అధికారులు బయటపెట్టలేదు. అమెరికా-చైనా సంబంధాల్లో రహస్య సమాచారం పరిరక్షణ ముఖ్యమైన అంశంగా ఉంటుందని తెలుసుకోవాలి. అందువల్ల, అమెరికా చైనాలో పనిచేస్తున్న సిబ్బందికి గతంలోనే కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న కాంట్రాక్టర్లు చైనీయులతో వ్యక్తిగత సంబంధాలు లేదా శారీరక సంబంధాలను ఏర్పరచకూడదని స్పష్టంగా తెలియజేసింది.

వివరాలు 

లైంగిక సంబంధం పెట్టుకోకుండా 1987లో యూఎస్‌ ప్రభుత్వం నిషేధం 

గతంలో మాస్కోలో ఒక నావికాదళ ఉద్యోగి సోవియట్ గూఢచారి ప్రలోభానికి లోనవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో అప్పటి సోవియట్ కూటమి, చైనాలో ఉన్న సిబ్బంది స్థానికులతో స్నేహం చేయడం, డేటింగ్ చేయడం లేక లైంగిక సంబంధం పెట్టుకోకుండా 1987లో యూఎస్‌ ప్రభుత్వం నిషేధించింది.