
Ather 450 Apex: ఒక్కసారి ఛార్జ్‌తో 157 కిమీ రేంజ్.. కొత్త ఏథర్ 450 అపెక్స్ స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
పర్యావరణహిత దృక్పథంతో పాటు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చే ఈవీ కంపెనీలలో ఏథర్ ఒకటి. తాజాగా నిర్వహించిన ఏథర్ కమ్యూనిటీ డే 2025' సందర్భంగా కంపెనీ ఏథర్ 450 అపెక్స్ స్కూటర్‌ను మరిన్ని అప్‌డేట్‌లతో లాంచ్ చేసింది. కొత్త ఫీచర్లు వాహనాన్ని మరింత స్మార్ట్‌గా, ఆచరణాత్మకంగా మార్చాయి. ముఖ్యంగా ఇన్‌ఫినిట్ క్రూయిజ్ సిస్టమ్, ఏథర్ స్టాక్ 7 సాఫ్ట్‌వేర్ వినియోగదారుల రోజువారీ ప్రయాణాలను సులభతరం చేస్తాయి.
Details
ఇన్‌ఫినిట్ క్రూయిజ్ సిస్టమ్ - మూడు ప్రత్యేక మోడ్‌లు
సాధారణ క్రూయిజ్ కంట్రోల్ కేవలం వేగాన్ని స్థిరంగా ఉంచగా, ఏథర్ కొత్త సిస్టమ్ రియల్ టైమ్ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తుంది. సిటీ మోడ్ నగర ట్రాఫిక్‌లో స్కూటర్ స్థిరమైన వేగంతో కదలడాన్ని సులభతరం చేస్తుంది. దీనివల్ల తరచుగా ఆగడం, మళ్లీ స్టార్ట్ చేయడం వల్ల కలిగే అలసట తగ్గుతుంది. హిల్ మోడ్ ఎత్తు ప్రదేశాల్లో టార్క్ పెంచి ఎక్కించగా, కిందకు దిగేటప్పుడు కంట్రోల్డ్ రీజెనరేటివ్ బ్రేకింగ్ అందిస్తుంది. దీంతో బ్రేక్‌లు, త్రోటిల్ ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు. క్రాల్ కంట్రోల్ రద్దీ రోడ్లు, గుంతల రోడ్లు లేదా జారుడు ప్రదేశాల్లో స్కూటర్‌ను గంటకు 10 కి.మీ వేగంతో సాఫ్ట్‌గా నడిపిస్తుంది.
Details
ఏథర్ స్టాక్ 7 - మెరుగైన సాఫ్ట్‌వేర్ అనుభవం
ఈ ఫీచర్లు హ్యాండిల్‌బార్‌పై ఉన్న రివర్స్ బటన్ ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. స్కూటర్ ఆగినప్పుడు ఆటోమేటిక్‌గా ఆగిపోయి, మళ్లీ ప్రయాణం ప్రారంభించిన వెంటనే తిరిగి పనిచేయడం ప్రారంభిస్తాయి. భారతీయ రోడ్లపై ట్రాఫిక్, విభిన్న రోడ్డు పరిస్థితులకు ఇవి మరింత ఉపయోగకరమని చెప్పవచ్చు. 450 అపెక్స్‌లో కొత్తగా ఏథర్ స్టాక్ 7 సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చింది. ఇది స్కూటర్ డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. 7 ఇంచ్ TFTటచ్‌స్క్రీన్ ప్రతిస్పందనలు వేగంగా, నావిగేషన్ సాఫ్ట్‌గా ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ మరింత సహజంగా పనిచేస్తుంది. ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు మరింత విశ్వసనీయంగా మారాయి. దీంతో కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లు సర్వీస్ సెంటర్‌కి వెళ్లకుండానే పొందవచ్చు. ఈ సౌకర్యం స్మార్ట్ వాహనాలకు కీలక మలుపు అని చెప్పాలి
Details
ఏథర్ 450 అపెక్స్ 2025.. స్పెసిఫికేషన్లు
కొత్త సాఫ్ట్‌వేర్, ఫీచర్లు జోడించినా, మెకానికల్ స్పెసిఫికేషన్లు మాత్రం మారలేదు. మోటార్: 7 కేడబ్ల్యూ పవర్, 26 ఎన్‌ఎం టార్క్ బ్యాటరీ: 3.7 కేడబ్ల్యూహెచ్ రేంజ్: ఒకసారి ఛార్జ్‌తో 157 కి.మీ డిజైన్: మునుపటి మాదిరిగానే స్మార్ట్ లైన్లు కొనసాగుతున్నాయి మ్యాజిక్ ట్విస్ట్ థ్రోటిల్ సిస్టమ్: మెకానికల్ బ్రేక్‌లపై ఆధారపడకుండా, రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో వాహనాన్ని నెమ్మదింపజేస్తుంది.