LOADING...
Simple Energy: సింగిల్ ఛార్జ్‌తో 181 కి.మీ.. సింపుల్ వన్‌ఎస్‌ ఈ-స్కూటర్‌ స్పెషల్‌ ఫీచర్లు ఇవే!
సింగిల్ ఛార్జ్‌తో 181 కి.మీ.. సింపుల్ వన్‌ఎస్‌ ఈ-స్కూటర్‌ స్పెషల్‌ ఫీచర్లు ఇవే!

Simple Energy: సింగిల్ ఛార్జ్‌తో 181 కి.మీ.. సింపుల్ వన్‌ఎస్‌ ఈ-స్కూటర్‌ స్పెషల్‌ ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా 2 వీలర్ సెగ్మెంట్‌లో డిమాండ్ భారీగా ఉంది. ఈ క్రమంలో మార్కెట్‌లో ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు లభ్యమవుతున్నాయి. మీరు కూడా మంచి రేంజ్ కలిగిన స్కూటర్ కోసం వెతుకుతున్నట్లయితే, సింపుల్ ఎనర్జీ సంస్థ తీసుకొచ్చిన సింపుల్ వన్‌ఎస్ మీకు సరైన ఎంపిక కావచ్చు. ఇప్పుడు దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

Details

పెర్ఫార్మెన్స్ & బ్యాటరీ 

సింపుల్ వన్‌ఎస్‌లో 8.5 కిలోవాట్ల (11.3 BHP) PMS మోటార్, అలాగే 3.7 కిలోవాట్ ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 181 కి.మీ (IDC) వరకు రేంజ్ ఇస్తుంది. వేగవంతమైన స్కూటర్ కావడంతోపాటు, పొడవైన ప్రయాణాలు చేయదగిన రేంజ్ కలిగి ఉంది. వేగం, రైడింగ్ మోడ్స్ ఈ స్కూటర్‌లో ఎకో, రైడ్, డాష్, సోనిక్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సోనిక్ మోడ్‌లో 0-40 కిమీ వేగాన్ని కేవలం 2.5 సెకన్లలో అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. 770 mm సీటు హైట్, 35 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉండటం వల్ల ఇది ప్రాక్టికల్ యూజ్‌కు అనుకూలంగా ఉంటుంది.

Details

వేరియంట్లు & కలర్ ఆప్షన్లు

ఈ ఏడాది మార్చ్‌లో లాంచ్ అయిన సింపుల్ వన్‌ఎస్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది: 1. గ్రేస్ వైట్ 2. అజూర్ బ్లూ 3. నమ్మ రెడ్ 4. బ్రేజెన్ బ్లాక్ ఫీచర్లు & టెక్నాలజీ వన్‌ఎస్ ఈ-స్కూటర్‌ 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 5G ఎనేబుల్డ్ ఈ-సిమ్‌తో వస్తుంది. ఇందులో ఉన్న ఇతర స్మార్ట్ ఫీచర్లు బ్లూటూత్ కనెక్టివిటీ కస్టమైజబుల్ థీమ్స్ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఓటీఏ అప్డేట్స్ ఫైండ్ మై వెహికల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫార్వర్డ్-రివర్స్ మోడ్‌తో పార్క్ అసిస్ట్ ఫంక్షన్

Details

 ధర & లభ్యత 

ఈ స్కూటర్‌ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.40 లక్షలు . ప్రస్తుతం బెంగళూరు, గోవా, పుణె, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, కొచ్చి, మంగళూరు నగరాల్లో మొత్తం 15 షోరూమ్‌లలో అందుబాటులో ఉంది. సింపుల్ ఎనర్జీ సంస్థ వచ్చే ఏడాదిలో 150 కొత్త స్టోర్లు, 200 సర్వీస్ సెంటర్లతో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో తన ఉనికిని విస్తరించనుంది. తమిళనాడులోని హోసూరులో ఉన్న ప్లాంట్ నుండి ఏడాదికి 1.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇన్నోవేషన్ ఒక గమ్యం కాదని, అది ఓ ప్రయాణమని సింపుల్ ఎనర్జీ సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నమే సింపుల్ వన్‌ఎస్. స్మార్ట్, ఒత్తిడి లేని రైడింగ్ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు.