Page Loader
2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం
బజాజ్ పల్సర్ 220Fవేగవంతమైన ఇండియన్ మోటార్‌సైకిల్

2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 25, 2023
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

బజాజ్ ఆటో భారతదేశంలో రెండు సంవత్సరాల విరామం తర్వాత పల్సర్ 220Fను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ సంస్థ ఇతర మోడల్స్ పల్సర్ F250, పల్సర్ RS200 ఇదే ధరలో లభిస్తున్నాయి. పల్సర్ 220Fని నిలిపేసిన తర్వాత, 2021లో బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ F250ని లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ 220Fవేగవంతమైన ఇండియన్ మోటార్‌సైకిల్. 2023 బజాజ్ పల్సర్ 220F దాని అవుట్‌గోయింగ్ మోడల్‌తో లాగానే ఉంటుంది. రైడర్ భద్రత కోసం, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ నైట్రోక్స్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది. ఇది OBD-2 కంప్లైంట్ 220cc, DTS-i, ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ తో నడుస్తుంది.

బైక్

బజాజ్ పల్సర్ RS200 పూర్తిగా ఫెయిర్డ్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్

బజాజ్ పల్సర్ F250 బ్రాండ్ కొత్త-ఏజ్ క్వార్టర్-లీటర్ ఆఫర్, రైడర్ భద్రత కోసం బైక్‌లో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి. ఇది సరికొత్త 249cc, ఎయిర్ ఆయిల్-కూల్డ్, SOHC, DTS-i, సింగిల్-సిలిండర్ ఇంజన్ తో నడుస్తుంది. బజాజ్ పల్సర్ RS200 పూర్తిగా ఫెయిర్డ్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్, ఇందులో రైడర్ భద్రత కోసం, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి. 199.5cc, DTS-i, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ తో నడుస్తుంది. భారతదేశంలో, బజాజ్ పల్సర్ 220F ధర రూ.1.37 లక్షలు, పల్సర్ F250 రూ.1.45 లక్షలు నుండి రూ.1.5 లక్షలు మధ్య ఉంది. పల్సర్ RS200 రూ.1.71 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ఉంటుంది.