2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది
ఈ వార్తాకథనం ఏంటి
జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా సిటీ సెడాన్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది.
కారు స్టైలిష్ లుక్, ADAS ఫీచర్లతో, రెండు పెట్రోల్ ఇంజన్‌ల ఆప్షన్ తో అందుబాటులో ఉంది.
మార్కెట్లో ఇది వోక్స్‌వ్యాగన్ వర్టస్ మోడల్ తో పోటీపడుతుంది. హోండా సిటీ భారతదేశంలోని మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. వోక్స్‌వ్యాగన్ దశాబ్ద కాలంగా కొనసాగుతున్న వెంటోకు బదులుగా వర్టస్‌ను గత ఏడాది జూన్‌లో ప్రవేశపెట్టారు.
రెండు కార్లకు ఒకటి కంటే ఎక్కువ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 2023 సిటీ 1.5-లీటర్ ఇన్‌లైన్-ఫోర్ పెట్రోల్ ఇంజన్ 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ సెటప్ ద్వారా నడుస్తుంది. వర్టస్ 1.0-లీటర్ TSI పెట్రోల్ మిల్లు 1.5-లీటర్ TSI మోటార్ తో నడుస్తుంది.
కార్
రెండూ కార్లలో విశాలమైన 5-సీటర్ క్యాబిన్ ఉంది
2023 హోండా సిటీ, వోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండూ విశాలమైన 5-సీటర్ క్యాబిన్‌ను అందిస్తున్నాయి.
2023 హోండా సిటీలో ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. మరోవైపు, వర్టస్ లో వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, సన్‌రూఫ్, USB ఛార్జర్‌లు, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.
భారతదేశంలో, 2023 హోండా సిటీ ప్రారంభ రూ. 11.49 లక్షలు నుండి రూ. 20.39 లక్షలు. వర్టస్ ధర రూ.11.32-18.42 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). హోండా సిటీ కన్నా వర్టస్ మెరుగైన రూపంతో పాటు తక్కువ ధరకు లభిస్తుంది.