399cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో రాబోతున్న 2023 Kawasaki Ninja ZX-4RR 399cc
Kawasaki ట్రాక్-ఫోకస్డ్ 2023 Kawasaki Ninja ZX-4RRని గ్లోబల్ మార్కెట్‌ల లో $9,699 (సుమారు రూ. 8 లక్షలు) ధరతో విడుదల చేయనుంది. సూపర్‌స్పోర్ట్ ఎంట్రీ-లెవల్ ZX-25R మరియు మిడ్-కెపాసిటీ ZX-6R మధ్య ఉంటుంది. ఈ బైక్ ఎయిర్ ఇన్‌టేక్ సిస్టమ్‌తో సరికొత్త 399cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్ తో నడుస్తుంది. MotoGPలో, ప్రపంచ సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన విజయాలను Kawasaki అందుకుంది. మిడిల్ వెయిట్ సూపర్‌స్పోర్ట్ విభాగంలో కొన్ని అత్యుత్తమ మోటార్‌సైకిళ్లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. Ninja ZX-25R, ZX-6R సబ్-800cc విభాగంలో అత్యంత సామర్థ్యం గల రేసింగ్ స్ట్రీట్-లీగల్ మోటార్‌సైకిళ్లు.
Ninja ZX-4RR సబ్-400cc సూపర్‌స్పోర్ట్ విభాగంలో అత్యంత సామర్థ్యం గల ట్రాక్-ఫోకస్డ్ మోటార్‌సైకిల్
రైడర్ భద్రత కోసం 2023 Kawasaki Ninja ZX-4RR ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ABS, Kawasaki ట్రాక్షన్ కంట్రోల్ (KTRC), రైడ్-బై-వైర్ థ్రోటిల్ తో పాటు రైడింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. మోటార్‌సైకిల్ వెనుక భాగంలో పూర్తిగా అడ్జస్ట్ చేయగల బ్యాక్-లింక్-రకం మోనో-షాక్ యూనిట్ ఉంది. 2023 Kawasaki Ninja ZX-4RR $9,699 (సుమారు రూ. 8 లక్షలు) ధరకు అందుబాటులో ఉంది. ఇది రేసింగ్ ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్‌లతో సబ్-400cc సూపర్‌స్పోర్ట్ విభాగంలో అత్యంత సామర్థ్యం గల ట్రాక్-ఫోకస్డ్ మోటార్‌సైకిల్.