2023 లెక్సస్ RX v/s 2024 BMW X5: ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏదీ!
కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇప్పటికే ఇండియాలో ఎన్నో నూతన కార్లను ప్రవేశపెట్టింది. ఆ కార్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా మరో నూతన మోడల్ కారును అందించడానికి సిద్ధమైంది. ఇండియాలో లెక్సస్ RX మోడల్ కారు లాంఛ్ చేసింది. ఈ కారులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే దీనికి పోటీగా 2024 BMW X5 రానుంది. ఈ రెండింట్లో ఏ కారు బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 2023 లెక్సస్ RX సిగ్నేచర్ 'స్పిండిల్ గ్రిల్,' బూమరాంగ్ ఆకారపు DRLలతో కూడిన సొగసైన LED హెడ్‌లైట్‌లు, బ్లాక్ రూఫ్ పట్టాలు, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా ఫీచర్స్ తో వస్తోంది.
Lexus RX ధర రూ. 95.8 లక్షలు
2024 BMW X5లో స్వెప్‌బ్యాక్LEDహెడ్‌లైట్‌లు, హెడ్ఆకారపు DRLలు, రూఫ్ రెయిల్‌లు, డ్యూయల్ ఎగ్జాస్ట్, డిజైనర్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. లెక్సస్ RX 4,890mmపొడవు, 1,920mm వెడల్పు, 1,695mm పొడవు, వీల్‌బేస్‌ను కలిగి ఉంది. BMW X5 మొత్తం పొడవు 4,922mm, వెడల్పు 2,218mm, ఎత్తు 1,745mm ఉంది. లెక్సస్ RX 2.4-లీటర్, నాలుగు-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ తో 2.5-లీటర్, ఇన్‌లైన్-ఫోర్ పెట్రోల్ మిల్లుతో రానుంది. భారతదేశంలో Lexus RX ధర రూ. 95.8 లక్షలు ఉంది. BMW X5 రూ. 98.5 లక్షలుగా ఉంది. అయితే BMW X5 లో కింగ్ డిజైన్, టెక్-ఫార్వర్డ్ క్యాబిన్, పవర్‌ట్రెయిన్ తో లెక్స్ RX కన్నా మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.