
2024 అప్రిలియా RS 457 Vs కేటీఎం RC390.. ఈ రెండు సూపర్ బైక్స్‌లో ఏదీ బెస్ట్?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలో అప్రిలియా సంస్థ ఆర్ఎస్ 457 బైక్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లోకి ఉన్న కేటీఎం ఆర్‌సీ 390 బైక్‌కు ఇది గట్టి పోటీని ఇవ్వనుంది.
ఈ తరుణంలో ఈ రెండు సూపర్ బైక్స్‌లో ఏదో బెస్ట్ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
అప్రిలియా ఆర్ఎస్ 457లో 48bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు క్విక్ షిప్టర్ ఉండనుంది.
KTM RC390 399cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను పొందుతుంది, ఇది 42.4 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో పాటు క్విక్‌షిఫ్టర్ కూడా ఇందులో ఉంది.
Details
అప్రిలియా ఆర్ఎస్ 457 ఎక్స్ షో రూం ధర రూ.4.5 లక్షలు
అప్రిలియా ఆర్ఎస్ 457లో సిగ్నేచర్ ట్రిపుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్ప్లిట్ టైప్ సీట్స్, క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్స్, అండర్- బెల్లీ ఎగ్జాస్ట్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
మరోవైపు కేటీఎం ఆర్‌సీ 390లో ఫ్యుయెల్ ట్యాంక్ షార్ప్‌గా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్, డీఆర్ఎల్స్, స్ప్లిట్ సీట్స్, బోల్ట్- ఆన్ సబ్‌ఫ్రేమ్, సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్, ఫుల్ కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తోంది.
అప్రిలియా ఆర్ఎస్ 457 ఎక్స్‌షోరూం ధర రూ. 4.5లక్షలుగా ఉండగా, 2023 కేటీఎం ఆర్‌సీ 390 ఎక్స్‌షోరూం ధర రూ. 3.18లక్షలుగా ఉంది.