Ultraviolette Tesseract: అల్ట్రావయలెట్ టెసెరాక్ట్ ఈవీ స్కూటర్‌కు భారీ డిమాండ్.. 48 గంటల్లో 20వేల ప్రీ బుకింగ్‌లు!
ఈ వార్తాకథనం ఏంటి
విద్యుత్ మోటార్‌సైకిళ్ల తయారీలో ప్రత్యేకత చూపిస్తున్న స్టార్టప్ సంస్థ అల్ట్రావయలెట్ తన తొలి ఈవీ స్కూటర్ టెసెరాక్ట్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.
లాంచ్ అయిన వెంటనే ఈ స్కూటర్‌కు అపూర్వ స్పందన లభించింది. ప్రీ బుకింగ్‌లు ప్రారంభమైన 48 గంటల్లోనే 20,000కి పైగా ఆర్డర్లు వచ్చాయి.
అల్ట్రావయలెట్ టెసెరాక్ట్ ప్రారంభ ధర రూ.1.20 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. అయితే ఈ ధర మొదటి 10,000 కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది.
మార్చి 5న ప్రారంభమైన ప్రీ బుకింగ్‌ల సమయంలో భారీ స్పందన రావడంతో సంస్థ మొత్తం 50,000 యూనిట్లను ఈ ప్రారంభ ధరకే అందించనుంది.
50,000 బుకింగ్‌ల అనంతరం స్కూటర్ ధర రూ.1.45 లక్షలకు పెరగనుంది.
Details
డెలివరీ వివరాలు
అల్ట్రావయలెట్ ప్రకటించిన సమాచారం ప్రకారం, 2026 తొలి త్రైమాసికం నుంచి స్కూటర్ల డెలివరీలు ప్రారంభమవుతాయి.
కేవలం రూ.999 మాత్రమే చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
డిస్‌ప్లే, స్టోరేజ్: 7 అంగుళాల TFT డిస్‌ప్లే, 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్
సేఫ్టీ ఫీచర్లు: ఫ్రంట్ & రియర్ రాడార్ టెక్నాలజీ, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, కొలిజన్ అవాయిడెన్స్, ఓవర్‌టేక్ అలర్ట్స్, లేన్ ఛేంజ్ అసిస్ట్, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్
బ్యాటరీ & రేంజ్: 6kWh బ్యాటరీ, ఒకే ఛార్జ్‌తో 261 కిమీ రేంజ్
పవర్ & వేగం: 20 హెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేసే మోటార్, 0-80 కిమీ వేగాన్ని 2.9 సెకన్లలో అందుకుంటుంది.