Honda Unicorn 2025: అత్యాధునిక ఫీచర్లతో 2025 హోండా యూనికార్న్ రిలీజ్
హోండా మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లోకి తన 2025 యూనికార్న్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్, బ్రాండ్‌కి ప్రాచుర్యం తీసుకువచ్చిన కమ్యూటర్ మోటార్ సైకిల్ శ్రేణికి మరిన్ని ఆధునిక ఫీచర్లు, అప్‌గ్రేడ్లతో వచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,19,481గా నిర్ణయించారు. 2025 యూనికార్న్‌లో 162.71cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అమర్చారు. ఇది OBD2B ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. 13 బీహెచ్‌పీ శక్తి, 14.58Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలిగే ఈ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మెరుగైన మైలేజ్, పవర్ డెలివరీ అందిస్తుంది. కొత్త హోండా యూనికార్న్‌లో పలు ఆధునిక ఫీచర్లు చేర్చారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, యూఎస్‌బీ టైప్-C ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి.
మూడు స్టైలిష్ రంగుల్లో బైక్
2025 యూనికార్న్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ ఆక్సిస్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ అనే మూడు స్టైలిష్ రంగుల్లో లభిస్తోంది. ఈ మోడల్ ధర పాత మోడల్ కంటే రూ. 8,180 అధికంగా ఉంది. మెరుగైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో 2025 హోండా యూనికార్న్ రోజువారీ ప్రయాణాలను సౌకర్యవంతంగా, భద్రతతో కూడిన అనుభూతిగా మార్చేలా చేస్తుంది. మొత్తానికి, హోండా తన 2025 యూనికార్న్ మోడల్‌తో భారతీయ కమ్యూటర్ మోటార్ సైకిల్ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఉంది. ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన ధరతో ఇది వినియోగదారుల కోసం అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది