LOADING...
2025 Hyundai Venue: 2025 హ్యుందాయ్ వెన్యూ వేరియంట్లు .. వాటి ఫీచర్లు..
2025 హ్యుందాయ్ వెన్యూ వేరియంట్లు .. వాటి ఫీచర్లు..

2025 Hyundai Venue: 2025 హ్యుందాయ్ వెన్యూ వేరియంట్లు .. వాటి ఫీచర్లు..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ కంపెనీ తాజాగా 2025 మోడల్ వెన్యూ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ఇంట్రొడక్టరీ ఎక్స్-షోరూమ్ ధర ₹7.90 లక్షలు, డిసెంబర్ 31 వరకే ఈ ధర అమల్లో ఉంటుంది. ఈ కొత్త వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 8 వేరియంట్లలో లభిస్తోంది: HX2, HX4, HX5, HX6, HX6T, HX7, HX8, HX10 కొత్త జనరేషన్ వెన్యూలో బాహ్య, అంతర్గత డిజైన్‌లో అనేక మార్పులు చేయడంతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అలాగే కొత్త డీజిల్ ఆటోమేటిక్ ఇంజిన్‌ను కూడా చేర్చారు. వెన్యూ కొనాలని అనుకుంటున్న వారి కోసం.. ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉంటాయో వివరంగా చూద్దాం.

వివరాలు 

2025 హ్యుందాయ్​ వెన్యూ- ఏ వేరియంట్​ ఏం అందిస్తుంది? 

HX2 వేరియంట్: ఎక్స్‌టీరియర్ ఫీచర్లు: హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు,LED DRLలు, LED టెయిల్ లైట్లు,15/16 ఇంచ్ స్టీల్ వీల్స్,షార్క్ ఫిన్ యాంటెన్నా,ముందు & వెనుక స్కిడ్ ప్లేట్లు, ఇంటీరియర్ & సౌకర్యం: బ్లాక్ ఇంటీరియర్ థీమ్, ఫాబ్రిక్ సీట్ కవర్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్,10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్,వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే,4 స్పీకర్ ఆడియో,స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్,మాన్యువల్ AC + రియర్ AC వెంట్,USB టైప్-C పోర్ట్స్, 12V పవర్ అవుట్‌లెట్,కీలెస్ ఎంట్రీ,పవర్ విండోలు, ఎలక్ట్రిక్ ORVM, సేఫ్టీ: 6 ఎయిర్‌బ్యాగ్స్,ABS + EBD,ESC, HSA,రియర్ పార్కింగ్ సెన్సార్లు,పిల్లల సీట్లకు ISOFIX,బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకునే వారికి ఇది సరైన ఎంపిక.

వివరాలు 

 HX4 - మరింత స్టైల్ + ఉపయోగకరమైన ఫీచర్లు

డార్క్ క్రోమ్ గ్రిల్,టర్న్ ఇండికేటర్‌లతో ORVM,రెండు రంగుల ఇంటీరియర్ థీమ్,ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ORVM,TPMS (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్),రియర్ డిఫాగర్ & రియర్ కెమెరా,పెట్రోల్ ఇంజిన్‌తో మంచి వాల్యూ ఆప్షన్! HX5 - డ్రైవర్ కోసం అదనపు సౌలభ్యం హైట్ అడ్జెస్ట్‌ చేసే డ్రైవర్ సీటు,సన్‌రూఫ్,ఆటోమేటిక్ వేరియంట్‌లలో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ & ప్యాడిల్ షిఫ్టర్లు,టర్బో / డీజిల్ వేరియంట్‌లలో క్రూయిజ్ కంట్రోల్,పెట్రోల్ మోడల్‌లో రిమోట్ ఇంజిన్ స్టార్ట్,ORVMలు ఆటో-ఫోల్డింగ్,₹10 లక్షల్లోపల సన్‌రూఫ్ కావాలంటే — ఇది బెస్ట్.

వివరాలు 

HX6 - టెక్నాలజీ & కంఫర్ట్ పెరుగుతాయి

క్వాడ్-బీమ్ ఆటో LED హెడ్‌లైట్లు,రూఫ్ రైల్స్, రియర్ స్పాయిలర్,వెనుక వైపర్ & వాషర్,ఆటోమేటిక్ AC, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్,ట్వీటర్లు (ముందు) అదనంగా,కూల్డ్ గ్లోవ్‌బాక్స్,60:40 స్ప్లిట్ రియర్ సీట్లు,రియర్ ఆర్మ్‌రెస్ట్ + సన్ షేడ్స్,సౌకర్యం, సౌకర్యం, మళ్ళీ సౌకర్యం.. ₹11లక్షల బడ్జెట్‌కు పర్ఫెక్ట్. HX7 - డీజిల్ కొనేవారికి బెస్ట్ 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్,రియర్ LED టర్న్ సూచనలు,కెబిన్‌లో మూన్-వైట్ యాంబియంట్ లైటింగ్,డీజిల్ ఎస్‌యూవీ కావాలంటే ఇది విలువైన ఆప్షన్.

వివరాలు 

HX8 - లగ్జరీ అనుభవం

డార్క్ నేవీ + డోవ్ గ్రే ఇంటీరియర్,లెదరెట్ సీట్ అప్హోల్‌స్టరీ,4-వే పవర్‌డ్రైవర్ సీట్,వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు,డ్రైవ్ మోడ్‌లు: ఎకో / నార్మల్ / స్పోర్ట్,టెర్రైన్ మోడ్‌లు: సాండ్ / మడ్ / స్నో,EPB + ఆటో హోల్డ్, అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు (AT వేరియంట్‌లలో),టర్బో పెట్రోల్ + కంఫర్ట్ ఫీచర్లు కావాలంటే.. ఇదే సరైన వేరియంట్. HX10 - టాప్-ఎండ్, ఫుల్ ఫీచర్ ప్యాక్ 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్,8-స్పీకర్ BOSE ఆడియో,టర్బో మోడల్స్‌లో ఇంజిన్ స్టార్ట్/స్టాప్,ఫ్రెంట్ & సైడ్ పార్కింగ్ సెన్సార్లు, Level-2 ADAS సేఫ్టీ సిస్టమ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అన్ని ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్​!