Page Loader
Best retro bike : యువతకు పిచ్చెక్కించే డిజైన్​, లుక్స్​తో సరికొత్త రెట్రో స్టైల్​డ్​ బైక్స్.. ఇండియాలో లాంచ్​కు రెడీ
సరికొత్త రెట్రో స్టైల్​డ్​ బైక్స్.. ఇండియాలో లాంచ్​కు రెడీ

Best retro bike : యువతకు పిచ్చెక్కించే డిజైన్​, లుక్స్​తో సరికొత్త రెట్రో స్టైల్​డ్​ బైక్స్.. ఇండియాలో లాంచ్​కు రెడీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 15, 2024
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ ఇండియాలో రీ-లాంచ్​ అవుతోంది. కొత్త రెట్రో డిజైన్​తో 2025 జనవరిలో రెండు కొత్త బైక్ మోడళ్లు విడుదల అవనున్నాయి. ఈ బైక్‌ల పేర్లు స్కౌట్ సిక్స్​టీ క్లాసిక్, స్కౌట్ సిక్స్​టీ బాబర్​. ఇవి యూరో5+ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త ఇంజిన్​తో విడుదల కానున్నాయి. రెండు మోడళ్లు ఆధునిక ఫీచర్లు, కొత్త డిజైన్‌తో వస్తాయి. స్కౌట్ సిక్స్​టీ క్లాసిక్: ఇది యూఎస్ తయారీదారుని సిగ్నేచర్ ఫ్లేర్డ్ ఫెండర్లతో, ప్రీమియం క్రోమ్ టచ్​తో డిజైన్ చేయబడింది. 654 మిమీ సీట్ హైట్‌తో ఇది రిలాక్స్​డ్​ ఎర్గోనామిక్స్‌ను అందిస్తుంది. 16-ఇంచ్​ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్​ కూడా ఉన్నాయి.

వివరాలు 

స్కౌట్ సిక్స్​టీ బాబర్

649 మిమీ సోలో బాబర్-స్టైల్ సీటుతో ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. 16-ఇంచ్​ కాస్ట్ అల్లాయ్ వీల్స్​పై ఇది ప్రయాణిస్తుంది. బాబర్ సౌందర్యాన్ని మినిమలిస్టిక్ విధానంతో ప్రదర్శిస్తుంది. ఈ మోడల్‌లో 120 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు ఉన్నాయి, క్లాసిక్ మోడల్‌లో 76 మిమీ డ్యూయల్ రియర్ షాక్​ అబ్సార్బర్స్​ ఉన్నాయి. 2025 ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ: కొత్త ఇంజిన్ 2025 స్కౌట్ సిక్స్​టీ మోడల్ 999 సీసీ స్పీడ్​ప్లస్ ఇంజిన్‌తో రానుంది. ఈ లిక్విడ్ కూల్డ్ వీ-ట్విన్ ఇంజిన్​ 85 బీహెచ్​పీ పవర్​ మరియు 87 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్​తో, మల్టీ-ప్లేట్ క్లచ్​తో ఇంజిన్ కనెక్ట్​ చేయబడింది.

వివరాలు 

2025 ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ: వేరియంట్లు 

స్కౌట్ సిక్స్​టీ బాబర్ మరియు క్లాసిక్ మోడళ్లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి: స్టాండర్డ్,లిమిటెడ్. స్టాండర్డ్ వేరియంట్‌లో ఏబీఎస్, ఎల్​ఈడీ లైటింగ్ ఉన్నాయి. ఈ బైకుల్లో కొత్త ఫ్యూయల్ గేజ్​, పెద్ద బ్యాటరీ ఉంటాయి. ఇండియన్ ఆప్షనల్‌గా రైడ్ కమ్ టచ్​స్క్రీన్ డిస్​ప్లేను కూడా అందిస్తుంది. లిమిటెడ్ వేరియంట్​లో ప్రత్యేకమైన 999 సీసీ ఇంజిన్​, ఫ్రేమ్ బ్యాడ్జింగ్ ఉంటాయి. క్లాసిక్ ట్రిమ్‌లో రెండు బైక్‌లు బ్లాక్ మెటాలిక్ కలర్ ఆప్షన్లతో ఉంటాయి. లిమిటెడ్ వేరియంట్​లో అదనంగా హెవీ మెటల్ కలర్ స్కీమ్​ ఉంటుంది. భారతదేశంలో ఈ మోడళ్ల ధరలు ప్రస్తుతం వెల్లడించలేదు. లాంచ్ సమయంలో క్లారిటీ వస్తుంది.