LOADING...
Mahindra Bolero: 2025 మహీంద్రా బొలెరో వేరియంట్ల ఆవిష్కరణ.. ఫీచర్లు, ధరల పూర్తి వివరాలివే!
2025 మహీంద్రా బొలెరో వేరియంట్ల ఆవిష్కరణ.. ఫీచర్లు, ధరల పూర్తి వివరాలివే!

Mahindra Bolero: 2025 మహీంద్రా బొలెరో వేరియంట్ల ఆవిష్కరణ.. ఫీచర్లు, ధరల పూర్తి వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 బొలెరోని మహీంద్రా తాజాగా లాంచ్ చేసింది. ఈ కొత్త శ్రేణిలో ముఖ్యమైన మార్పులు, అత్యంత టాప్-స్పెక్ బీ8 ట్రిమ్ కూడా ప్రవేశపెట్టడం విశేషం. ఇప్పుడు బొలెరో నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియంట్ల ఫీచర్లు, ధరలు, లక్ష్య వినియోగదారుల వివరాలు ఇలా ఉన్నాయి:

Details

అన్ని వేరియంట్లలో ప్రధాన ఫీచర్లు

ఏబీఎస్ + ఈబీడీ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఇంజిన్ ఇమ్మొబిలైజర్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు మైక్రో-హైబ్రిడ్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ వేరియంట్లు, ఫీచర్లు, ధరలు బీ4 వేరియంట్ - ధర: ₹7.99 లక్షలు డిజైన్: సాధారణ నలుపు గ్రిల్, క్యాప్‌లు లేని స్టీల్ వీల్స్, ఫాగ్ ల్యాంప్‌లు లేవు ఇంటీరియర్: వినైల్ సీట్లు, మ్యాన్యువల్ ఎయిర్-కండిషనింగ్, పవర్ స్టీరింగ్, ఫ్లిప్ కీ టార్గెట్: తక్కువ నిర్వహణ ఖర్చు, మెకానికల్ సరళత కోరుకునే వినియోగదారులు, ఫ్లీట్ ఆపరేటర్లు, గ్రామీణ ప్రాంతాల కోసం

Details

 2. బీ6 వేరియంట్  - ధర: ₹8.69 లక్షలు

డిజైన్: క్రోమ్ డీటైలింగ్, వీల్ క్యాప్‌లు ఫీచర్లు: పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రిమోట్-కీ ఇంటీరియర్: 17.8 సెం.మీ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఫ్యాబ్రిక్ సీట్లు, USB టైప్-C ఛార్జింగ్, 12వీ సాకెట్ టార్గెట్: సౌకర్యాలు, ప్రాక్టికల్ ఫీచర్స్ కోరుకునే వినియోగదారులు

Details

 3. బీ6(ఓ) వేరియంట్ - ధర: ₹9.09 లక్షలు

విజిబిలిటీ: స్టాటిక్ బెండింగ్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు మౌలిక సౌకర్యాలు: వెనుక వాష్-అండ్-వైపర్ సెటప్ టార్గెట్: తక్కువ విజిబిలిటీ, సెమీ-అర్బన్ మార్గాల్లో ప్రయాణించే వినియోగదారులు

Details

 4. బీ8 వేరియంట్  - ధర: 9.69 లక్షలు

డిజైన్: క్రోమ్ అప్డేటెడ్ గ్రిల్, ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ ఫాగ్ ల్యాంప్‌లు, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ రంగులు: స్టీల్త్ బ్లాక్ (కొత్త), డైమండ్ వైట్, రాకీ బీజ్, DSAT సిల్వర్ ఇంటీరియర్: లెదరెట్ అప్‌హోల్‌స్టరీ, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ టార్గెట్: కఠినత్వం, మన్నికతో పాటు ప్రీమియం సౌకర్యాలు కోరుకునే వ్యక్తిగత వినియోగదారులు 2025 బొలెరో రేంజ్‌లో ప్రతి వేరియంట్ భద్రత, సౌకర్యం, నాణ్యతలో ప్రత్యేకంగా నిలుస్తుంది.