Hyundai Venue-N:సరికొత్త 2025 హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ N లైన్ రేపు ఆవిష్కరణకు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కొత్త ఉత్సాహాన్ని రగిలించేందుకు హ్యుందాయ్ సంస్థ తన 2025 న్యూ జనరేషన్ వెన్యూను సిద్ధం చేసింది. దీని స్పోర్టీ వెర్షన్ అయిన వెన్యూ N లైన్ కూడా అదే రోజున విడుదల కానుంది. హ్యుందాయ్ ఇప్పటికే ఈ రెండు మోడళ్లకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది. పాత వెర్షన్‌తో పోలిస్తే డిజైన్, ఫీచర్లు మరియు సాంకేతికతలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా, డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చేర్చడం ఈ ఎస్‌యూవీ ఆకర్షణను మరింత పెంచింది. అధునాతన టెక్నాలజీతో కూడిన పలు భద్రతా ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
ఇప్పుడు కొత్త తరం వెన్యూ గురించి తప్పక తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్య అంశాలు ఇవి..
బుకింగ్ వివరాలు: 2025 వెన్యూ,వెన్యూ N లైన్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టోకెన్ అమౌంట్: ₹25,000 చెల్లించి ఈ రెండు ఎస్‌యూవీలలో ఏదైనా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విధానం: హ్యుందాయ్ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా లేదా సమీప హ్యుందాయ్ షోరూమ్‌ను సందర్శించి రిజర్వేషన్ చేసుకోవచ్చు. లాంచ్ తేదీ: నవంబర్ 4 (రేపు). డిజైన్‌లో ప్రధాన మార్పులు కొత్త తరం వెన్యూ, వెన్యూ N లైన్ మోడళ్లలో ఎక్స్‌టీరియర్,ఇంటీరియర్‌లో గణనీయమైన అప్‌డేట్‌లు ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌లో: ఆధునిక హెడ్‌ల్యాంప్‌లు,ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు,ఆకర్షణీయమైన బంపర్‌లు, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు చేర్చబడ్డాయి. ఇంటీరియర్‌లో: కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, ప్రీమియం లుక్, మెరుగైన కంఫర్ట్ ఫీచర్లు కలిపి వాహనానికి విలాసవంతమైన అనుభూతిని ఇస్తాయి.
వివరాలు
క్యాబిన్ ఫీచర్లు
వెన్యూ 2025 సిరీస్‌లో ఇంటీరియర్ భాగంలో అధునాతన సాంకేతిక సదుపాయాలు అందించారు. డిస్‌ప్లేలు: డ్రైవర్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం రెండు 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌లు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ: 70 ఫీచర్లతో కూడిన బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలాగే వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయాలు ఉన్నాయి. లగ్జరీ ఫీచర్లు: ఎనిమిది స్పీకర్లతో బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అలాగే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా అందిస్తున్నారు.
వివరాలు
భద్రతా సదుపాయాలు - లెవల్ 2 ADAS
భద్రత విషయంలో హ్యుందాయ్ ఎలాంటి రాజీ పడలేదు. కొత్త వెన్యూ మోడల్స్‌లో లెవల్ 2 ADAS సూట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్: ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ప్రామాణికంగా అందిస్తారు. అసిస్టెన్స్ ఫీచర్లు: ABS విత్ EBD, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), HAC (హిల్ అసిస్ట్ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), EPB (ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్) ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. కెమెరా టెక్నాలజీ: 360° సరౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటో-డిమ్మింగ్ IRVM వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
వివరాలు
ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు
కొత్త వెన్యూ మోడల్‌లో గత వెర్షన్‌లోని ఇంజిన్ సెటప్‌లను కొనసాగించారు. ఇంజిన్ ఎంపికలు: 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు: 5-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్) గేర్‌బాక్స్‌లు. ప్రధాన అప్‌డేట్: ఈసారి డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉండటం కొత్త విశేషం. వెన్యూ N లైన్ ప్రత్యేకత: ఇది కేవలం 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీంట్లో 6-స్పీడ్ మాన్యువల్ లేదా DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉంటాయి.