2025 Vespa 125: రూ. 1.32 లక్షలతో 2025 వెస్పా స్కూటర్ లైనప్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్ అదుర్స్!
ఈ వార్తాకథనం ఏంటి
వెస్పా 2025 మోడల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.
2025 వెస్పా లైన్‌అప్‌లో అత్యाधునిక టెక్నాలజీతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఎడిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త వెస్పా మోడల్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ₹1.32 లక్షలు కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర ₹1.96 లక్షల వరకు ఉంది.
వెస్పా మోడల్స్‌లో స్మూత్ యాక్సిలరేషన్ మరియు మెరుగైన గ్రేడబిలిటీ కోసం కొత్త ఇంజిన్‌ను అందించారు.
వివరాలు
వెస్పా వేరియంట్లు
2025 వెస్పా 125 లైన్‌అప్‌లో వెస్పా, వెస్పా ఎస్, వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్ వేరియంట్లు ఉన్నాయి.
బేస్ వెర్షన్ ముందు మాదిరిగానే అదే డిజైన్‌తో కొనసాగుతుంది. వెస్పా, వెస్పా ఎస్ వేరియంట్లు 125cc, 150cc ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తాయి.
కలర్ ఆప్షన్లు
కొత్త వెస్పా మోడల్స్ విభిన్నమైన రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
వీటిలో వెర్డే అమాబిల్,రోస్సో రెడ్,పెర్ల్ వైట్, నీరో బ్లాక్, అజురో ప్రోవెన్జా,బ్లూ,ఆరెంజ్ వంటి రంగులు ఉన్నాయి.
వెస్పా ఎస్ మోడల్‌లో ప్రత్యేకంగా గోల్డ్ టింట్‌తో ఒరో స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంటుంది.
వెస్పా ఎస్ రంగుల ఎంపికల్లో వెర్డే ఎంబిజియోసో (మాట్),ఒరో,పెర్ల్ వైట్,నీరో బ్లాక్ (మాట్),జియాలో యెల్లో(మాట్),అరెన్సియో ఇంపల్సివో, రెడ్, బ్లాక్, పెర్ల్ వైట్ ఉన్నాయి.
వివరాలు
వెస్పా టెక్
వెస్పా తన లైనప్‌ను వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్ వేరియంట్లతో విస్తరించింది.
వీటి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹1.92 లక్షలు. ఈ వేరియంట్లు 125cc, 150cc ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.
టెక్నాలజీ పరంగా, వెస్పా టెక్, ఎస్ టెక్ మోడల్స్ కీలెస్ ఇగ్నిషన్, కొత్త టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్లను కలిగి ఉంటాయి.
వెస్పా టెక్ "క్వాలా" అనే ప్రత్యేక ఎడిషన్‌లో అందుబాటులో ఉంది, ఇందులో ట్రెడిషనల్ మెహందీ ఆర్ట్ డిజైన్‌ను వినియోగించారు.
వివరాలు
వెస్పా టెక్ కలర్ ఆప్షన్లు:
వెస్పా టెక్ కోసం ఎనర్జికో బ్లూ, గ్రిగియో గ్రే కలర్ ఆప్షన్స్ అందిస్తారు. వెస్పా ఎస్ టెక్ కోసం నీరో బ్లాక్(మాట్), పెర్ల్ వైట్ కలర్స్ ఉన్నాయి.
విక్రయాలు ఫిబ్రవరి 25 నుండి
2025 వెస్పా మోడల్స్ ఫిబ్రవరి 25 నుండి భారతదేశంలోని అన్ని డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. వెస్పా తనను తాను భారతదేశంలో లగ్జరీ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా స్థిరపర్చుకుంటోంది.