
2025 Yezdi Adventure:సరికొత్త 2025 యెజ్డి అడ్వెంచర్ లాంచ్.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
గత నెలలో దేశంలో భౌగోళిక,రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కొంతకాలం ఆలస్యమైన తర్వాత, క్లాసిక్ లెజెండ్స్ బుధవారం నాడు తమ 2025 యజ్డీ అడ్వెంచర్ మోడల్‌ను అధికారికంగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ఈ మోటార్ సైకిల్‌ను ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.15 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేశారు.
కాగా, దీనిలో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 2.27 లక్షలుగా ఉంటుంది (ఎక్స్-షోరూమ్).
బుకింగ్స్ ప్రారంభం
2025 యజ్డీ అడ్వెంచర్ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ తీసుకుంటున్నారు.
ఈ మోడల్ పలు కీలక మార్పులతో మార్కెట్‌లోకి వస్తోంది, ముఖ్యంగా దాని డిజైన్ లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ మార్పులు కొత్త ఫీచర్లను అందించడమే కాకుండా బైక్‌కు ప్రత్యేక గుర్తింపును కల్పిస్తున్నాయి.
వివరాలు
2025 యజ్డీ అడ్వెంచర్‌లో కొత్తగా ఏమి ఉన్నది?
ఈసారి బైక్‌కి కొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్‌ను అందించారు,ఇందులో ట్విన్ హెడ్ ల్యాంప్ సెటప్ ఉంది.
ఈ డిజైన్ పాత బిఎమ్‌డబ్ల్యూ జీఎస్ మోడళ్లను తలపించేలా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఇది సరికొత్తగా, ఆధునికంగా కనిపిస్తుంది.
ఇందులోని కొత్త ఎల్ఈడీ డేఅరైడింగ్ లైట్లను (DRL) కూడా చేర్చారు.
అదేవిధంగా ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, టెయిల్ సెక్షన్‌లలోనూ మార్పులు చేశారు. ఈ మార్పుల వలన బైక్ మరింత ప్రీమియంగా, ఆకర్షణీయంగా మారింది.
అలాగే ఇంధన ట్యాంక్ చుట్టూ క్రాష్ గార్డులను అమర్చారు.
ఈ మోడల్‌లో అడ్జస్టబుల్ వైజర్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్చబుల్ ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
2025 యజ్డీ అడ్వెంచర్: ముఖ్యమైన స్పెసిఫికేషన్లు
ఈ బైక్‌కి గత సంవత్సరం విడుదలైన యే ఇంజన్‌ను కొనసాగించారు.
334 సీసీ సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఆల్ఫా2 ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.
ఇది గరిష్టంగా 29 బిహెచ్పీ పవర్ మరియు 29.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ అమర్చారు.
రెండు చక్రాలకూ డిస్క్ బ్రేకులు ఉన్నాయని, బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉండేలా చూసారు.
ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ను స్టాండర్డ్‌గా కలిపారు.
అలాగే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. తాజాగా ఈ బైక్‌కు కొత్త కలర్ ఆప్షన్లు కూడా ప్రవేశపెట్టారు.