2026 Toyota Glanza Facelift: రూ.6.99 లక్షలతో కొత్త గ్లాంజా లాంచ్.. డిజైన్, ఇంజిన్‌లో ఏం మారాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.6.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. మారుతి సుజుకి బాలెనోకు అప్డేట్ వచ్చిన తర్వాత టయోటా గ్లాంజాలోనూ కీలక మార్పులు చేసింది. కొత్త డిజైన్,అదనపు ఫీచర్లు,అప్డేట్ చేసిన ఇంజిన్‌తో ఈ కారును తీసుకొచ్చింది. హ్యుందాయ్ ఐ20,టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లకు ఇది పోటీగా నిలవనుంది. ధరల విషయానికి వస్తే.. గ్లాంజా E వేరియంట్ రూ.6.99 లక్షల నుంచి,S వేరియంట్ రూ.7.71 లక్షల నుంచి, G వేరియంట్ రూ.8.73 లక్షల నుంచి, V వేరియంట్ రూ.9.99 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్ V (O) ధర రూ.10.49 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలే.
వివరాలు
బానెట్‌పై టయోటా లోగో
డిజైన్‌లో భాగంగా ముందు వైపు పెద్ద గ్రిల్‌ను అందించారు.
ఇందులో రాడార్ మాడ్యూల్స్ ఉన్నాయి. హెడ్లైట్ల డిజైన్ పాత మోడల్లాగే ఉండగా, LED ఫాగ్ ల్యాంప్స్‌లో మార్పులు చేశారు.
బానెట్‌పై టయోటా లోగోను ఉంచారు. డిజిటల్ టీల్ గ్రీన్, బ్లూయిష్ బ్లాక్ అనే రెండు కొత్త రంగుల్లోనూ ఈ కారు లభిస్తుంది.
ఇంటీరియర్‌లో లెదరెట్ సీట్లు, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్ ఉన్నాయి.
భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, లెవల్-2 ADAS ఫీచర్లు ఇచ్చారు.
వివరాలు
కొత్త 1.2 లీటర్, మూడు సిలిండర్ల Z12E ఇంజిన్
ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త 1.2 లీటర్, మూడు సిలిండర్ల Z12E ఇంజిన్‌ను అందించారు.
పెట్రోల్ వెర్షన్ 83 hp శక్తి, 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్ 70 hp శక్తి, 102 Nm టార్క్‌ను అందిస్తుంది.
రెండు వెర్షన్లలోనూ 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. పాత ఇంజిన్‌తో పోలిస్తే శక్తి కొంత తగ్గినా, మైలేజీ స్వల్పంగా మెరుగుపడింది.