Loading...
Kawasaki Z650RS: 2027 కవాసకి Z650RS వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే
2027 కవాసకి Z650RS వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే

Kawasaki Z650RS: 2027 కవాసకి Z650RS వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో 2027 మోడల్‌ Z650RS మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.7.83 లక్షలుగా నిర్ణయించింది. తాజా మోడల్‌లో ఇంజిన్‌, సైకిల్‌ పార్ట్స్‌, ఫీచర్లు, కొలతల విషయంలో మునుపటి మోడల్‌తో పోలిస్తే పెద్దగా మార్పులు చేయలేదు. ఇంజిన్‌ విషయానికొస్తే.. 649సీసీ, లిక్విడ్‌ కూల్డ్‌ ప్యారలల్‌ ట్విన్‌ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించారు. ఇది 8,000 ఆర్‌పీఎం వద్ద 68 హెచ్‌పీ పవర్‌, 6,700 ఆర్‌పీఎం వద్ద 64 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వివరాలు 

ఫ్రేమ్‌, సస్పెన్షన్‌, బ్రేకింగ్‌ వ్యవస్థ

2027 కవాసకి Z650RSలో ట్యూబ్యులర్‌ డైమండ్‌ టైప్‌ స్టీల్‌ ఫ్రేమ్‌ను కొనసాగించారు.

ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, వెనుక భాగంలో హారిజాంటల్‌ బ్యాక్‌-లింక్‌ సస్పెన్షన్‌ సెటప్‌ ఉంది.

బ్రేకింగ్‌ కోసం ముందు వైపు రెండు 300 మి.మీ. డిస్కులు, వెనుక వైపు ఒక 220 మి.మీ. డిస్క్‌ను అందించారు.

ఈ బైక్‌ 17 అంగుళాల వీల్స్‌పై నడుస్తుంది. ముందు భాగంలో 120/70 సెక్షన్‌ టైర్‌, వెనుక వైపు వెడల్పాటి 160/60 టైర్‌ను అమర్చారు.

దీని వీల్‌బేస్‌ 1,405 మి.మీ.గా, సీట్‌ ఎత్తు 800 మి.మీ.గా ఉంది. కొలతల్లోనూ మునుపటి మోడల్‌తో పోలిస్తే మార్పులు లేవు.

వివరాలు 

నియో-రెట్రో డిజైన్‌, ట్రాక్షన్‌ కంట్రోల్

కవాసకి Z650RS తన నియో-రెట్రో డిజైన్‌ను కొనసాగిస్తోంది.

ఇందులో రౌండ్‌ ఎల్ఈడీ హెడ్‌లైట్‌, మల్టీ-ఫంక్షన్‌ ఎల్‌సీడీతో కూడిన డ్యూయల్‌-పాడ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఉన్నాయి.

స్పోక్‌ తరహా కాస్ట్‌ అల్లాయ్‌ వీల్స్‌, హారిజాంటల్‌ డిజైన్‌లో ఉన్న వెనుక భాగం దీని ప్రత్యేకతల్లో ఉన్నాయి.

ఈ మోటార్‌సైకిల్‌ బరువు 192 కిలోలు. 12 లీటర్ల సామర్థ్యం ఉన్న ఫ్యూయల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంది.

ఎలక్ట్రానిక్‌ ఫీచర్లలో భాగంగా కవాసకి ట్రాక్షన్‌ కంట్రోల్‌ (KTRC)ను కూడా అందించారు.

ADVERTISEMENT