Page Loader
'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా 
'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా

'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా 

వ్రాసిన వారు Stalin
Sep 30, 2023
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఆటోమోటివ్ తయారీ సంస్థ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. తన కంపెనీకి చెందిన జనాదరణ పొందిన ఎక్స్‌యూవీ-300 మోడల్ కార్ల ధరలను పెంచింది. రెండు నెలల్లోనే ఎక్స్‌యూవీ-300 మోడల్ కార్ల ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అయితే ధరలను ఎందుకు పెంచారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, సరఫరాలో అంతరాయాలు ధరలను పెంచడానికి కారణంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరల నేపథ్యంలో సబ్-ఫోర్-మీటర్ ఎస్ యూవీ మోడల్ కార్లపై గరిష్టంగా రూ.68,501 పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.

కారు

ఎక్స్‌యూవీ-300 వేరియంట్‌ల కొత్త ధరలు ఇలా..

ఎక్స్‌యూవీ-300 W4 పెట్రోల్ MT మోడల్‌పై రూ.25,002 పెరిగింది. దీంతో కారు మొత్తం ధర రూ. 8.67లక్షలకు చేరుకుంది. W2 పెట్రోల్ MT, W6 పెట్రోల్ MT ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎక్స్‌యూవీ-300 W2 పెట్రోల్ MT వేరియంట్ ప్రారంభ ధర 7.99 లక్షలుగా నిర్ణయించారు. W8 (O) డీజిల్ AMT మోడల్ ధర కారు ఎక్స్-షోరూమ్ రూ. 14.75 లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఈ ధరల పెరుగుదల అనేది మహీంద్రా ఎక్స్‌యూవీ-300కొనాలనుకునే వారిని నిరుత్సాహపరుస్తుంది. మరోపక్క ధరలు పెరిగినప్పటికీ, ఎస్‌యూవీలో తమ మోడల్ కారు మంచి ఎంపిక అవుతుందని కంపెనీ ఇప్పటికీ భావిస్తోంది. అయితే ఫీచర్లలో మాత్రం ఇప్పటికీ మహింద్రాకు చెందిన ఈ కారు టాప్ లో ఉండటం గమనార్హం.