LOADING...
Simple Ultra Electric Scooter: ఒక్క ఛార్జ్‌తో 400KM రేంజ్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ను షేక్ చేస్తుందా?
ఒక్క ఛార్జ్‌తో 400KM రేంజ్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ను షేక్ చేస్తుందా?

Simple Ultra Electric Scooter: ఒక్క ఛార్జ్‌తో 400KM రేంజ్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ను షేక్ చేస్తుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింపుల్ ఎనర్జీ భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో మరో సంచలనానికి తెరలేపింది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యంతో కొత్త 'సింపుల్ అల్ట్రా' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. భారీ రేంజ్, ఆధునిక టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్ ఇప్పుడు ఈవీ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. పెట్రోల్ బైక్‌లకు ప్రత్యామ్నాయంగా, కేవలం సిటీ రైడ్స్‌కే కాకుండా లాంగ్ ట్రిప్స్‌కూ సరిపోయేలా ఈ ప్రీమియం స్కూటర్‌ను రూపొందించారు. ఈ స్కూటర్‌లో 6.5 kWh సామర్థ్యం గల భారీ లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు.

వివరాలు

అత్యధిక రేంజ్ కలిగిన స్కూటర్లలో ఒకటిగా గుర్తింపు

దీనికి ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉండటంతో వర్షం, ధూళి వంటి పరిస్థితుల్లోనూ బ్యాటరీ సురక్షితంగా పనిచేస్తుంది. ఈ పవర్‌ఫుల్ బ్యాటరీ సాయంతో సింగిల్ ఛార్జ్‌పై 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం భారతీయ టూ-వీలర్ ఈవీ మార్కెట్లో ఇది అత్యధిక రేంజ్ కలిగిన స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. స్కూటర్‌లో 8.8 kW సామర్థ్యం గల PMSM ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సాయంతో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు కేవలం 2 గంటల 15 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు.

వివరాలు

ఇందులో 7 ఇంచుల భారీ TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే

టెక్నాలజీ పరంగా కూడా ఈ స్కూటర్‌ను అత్యాధునికంగా రూపొందించారు. ఇందులో 7 ఇంచుల భారీ TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, ఇన్‌బిల్ట్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో పాటు OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. రైడర్ అవసరాలకు అనుగుణంగా ఎకో ఎక్స్, ఎకో, రైడ్, ఎయిర్, సోనిక్, సోనిక్ ఎక్స్ అనే ఆరు రకాల రైడింగ్ మోడ్స్‌ను అందించారు. భద్రత విషయంలో కూడా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

Advertisement

వివరాలు

వెనుక చక్రాలకు డ్యూయల్ డిస్క్ బ్రేకులు

ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రెజెనరేటివ్ బ్రేకింగ్,TPMS, ఫాల్ డిటెక్షన్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్స్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్మూత్ రైడింగ్ కోసం వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్‌ను అమర్చారు. మెరుగైన బ్రేకింగ్ కోసం ముందు, వెనుక చక్రాలకు డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఇచ్చారు. అలాగే 26 లీటర్ల భారీ బూట్ స్పేస్, అలాయ్ వీల్స్‌తో కూడిన ట్యూబ్‌లెస్ టైర్లు ఈ స్కూటర్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారత మార్కెట్లో ఈ సింపుల్ వన్ ఆధారిత 'సింపుల్ అల్ట్రా' ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్‌-షోరూమ్ ధర రూ.2,34,999గా నిర్ణయించారు. 400 కిలోమీటర్ల భారీ రేంజ్, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా దీర్ఘకాలంలో ఇది వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండొచ్చు.

Advertisement