Loading...
Ford GT41: 41 అంగుళాల ఎత్తు.. హైబ్రిడ్ V8 పవర్.. Ford కొత్త హైపర్‌కార్ వచ్చేసింది!
41 అంగుళాల ఎత్తు.. హైబ్రిడ్ V8 పవర్.. Ford కొత్త హైపర్‌కార్ వచ్చేసింది!

Ford GT41: 41 అంగుళాల ఎత్తు.. హైబ్రిడ్ V8 పవర్.. Ford కొత్త హైపర్‌కార్ వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ ఫోర్డ్ తన సరికొత్త హైపర్‌కార్ GT41ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ కారు పేరులోని 41 సంఖ్య.. దీని ఎత్తు 41 అంగుళాలు ఉండటాన్ని సూచిస్తుంది. గతంలో ప్రసిద్ధి చెందిన GT40 మోడల్‌ను గుర్తు చేసేలా ఈ పేరును ఎంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఖతార్‌లో జరిగే వరల్డ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్ (WEC) తొలి రౌండ్‌లో GT41 రేసింగ్ అరంగేట్రం చేయనుంది. దీంతో ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో టాప్ క్లాస్ రేసింగ్‌కు ఫోర్డ్ తిరిగి రానుంది. ఆ తర్వాత 2027 జూన్ 12న జరగనున్న 24 అవర్స్ ఆఫ్ లీ మాన్స్ రేసులోనూ ఈ హైపర్‌కార్ పాల్గొననుంది.

వివరాలు

హైబ్రిడ్ V8 ఇంజిన్‌తో GT41

ఫోర్డ్ GT41లో సహజసిద్ధంగా పనిచేసే 5.4 లీటర్ హైబ్రిడ్ V8 ఇంజిన్‌ను అమర్చారు. ఈ పవర్‌ట్రెయిన్‌ను పూర్తిగా సంస్థలోనే అభివృద్ధి చేయడం ఫోర్డ్‌కు ప్రత్యేక గర్వకారణంగా నిలిచింది.

గతంలో కొన్ని ప్రాజెక్టుల కోసం ఇతర సంస్థలతో కలిసి పనిచేసిన ఫోర్డ్.. ఈసారి ఇంజిన్ అభివృద్ధి నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్ని పనులను స్వయంగా చేపట్టింది.

ఇంజిన్ విడిభాగాల తయారీ, ఇంజిన్ కాలిబ్రేషన్, సాఫ్ట్‌వేర్, లైట్లు, వైపర్ల వంటి సహాయక వ్యవస్థలకు అవసరమైన లో-వోల్టేజ్ సిస్టమ్స్‌ను కూడా డియర్‌బోర్న్‌లోని ఫోర్డ్ రేసింగ్ విభాగమే అభివృద్ధి చేసింది.

వివరాలు

హైపర్‌కార్ ప్రాజెక్టులో ఫోర్డ్ ఒంటరిగానే..

ఫోర్డ్ రేసింగ్ పవర్‌ట్రెయిన్ చీఫ్ ఇంజినీర్ క్రిస్టియన్ హెర్ట్రిచ్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకతను వివరించారు. GT3, NASCAR, GT వంటి రేసింగ్ ప్రోగ్రామ్‌లలో ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తామని.. కానీ హైపర్‌కార్ ప్రాజెక్టులో మాత్రం ఫోర్డ్ ఒక్కటే పనిచేస్తోందని తెలిపారు.

చాలా ప్రాజెక్టుల విషయంలో మేము ఇలా చెప్పలేం. ఈ ప్రాజెక్టులో విజయం సాధిస్తాం.

అయితే ఆ విజయాన్ని అందుకునే క్రమంలో కొన్ని వైఫల్యాలు ఎదురవుతాయి. వాటికి మేమే బాధ్యత వహించాలి'' అని హెర్ట్రిచ్ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

ప్రొడక్షన్ Coyote బ్లాక్‌తో ఇంజిన్ తయారీ

ఈ హైపర్‌కార్‌కు శక్తినిచ్చే ఇంజిన్ తయారీ ప్రక్రియ ప్రొడక్షన్ వాహనాల కోసం ఉద్దేశించిన Coyote బ్లాక్‌తో ప్రారంభమవుతుంది.

అక్కడి నుంచి దాన్ని ఫోర్డ్ కొత్త గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో ఉన్న డైనమోమీటర్ ల్యాబ్‌లోని ప్రత్యేక విభాగానికి తరలిస్తారు.

ఈ ల్యాబ్‌లో 100కు పైగా టెస్ట్ సెల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే తమ వాహనాల ఇంజిన్లను ఫోర్డ్ ఇక్కడ పరీక్షించి, వాటి పనితీరును ధ్రువీకరిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

ఇద్దరు టెక్నీషియన్ల చేతుల్లో హైపర్‌కార్ ఇంజిన్

1960లలో లీ మాన్స్ విజయం సాధించిన ఫోర్డ్ ఇంజిన్లను పరీక్షించిన ప్రాంతానికి సమీపంలోని ఓ చిన్న గదిలో కొత్త హైపర్‌కార్ ఇంజిన్ల తయారీ జరుగుతోంది.

ఆ గదిలో ఇద్దరు టెక్నీషియన్లు ఇంజిన్లను రూపొందిస్తున్నారు. ఇరుకైన ఈ గదిలో ఒకవైపు పొడవైన కౌంటర్, వెనుక భాగంలో రెండు ఇంజిన్ స్టాండ్లు ఉన్నాయి.

స్థలం చిన్నదైనప్పటికీ.. ఇంజిన్ తయారీ, పరీక్షల విభాగాల్లో పనిచేసే బృందాల మధ్య సమన్వయం, సమాచార మార్పిడికి ఈ ఏర్పాటు ఉపయోగపడుతోంది.

ADVERTISEMENT