Page Loader
సింగిల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు.. కొత్త ఈవీని విడుదల చేసిన ఆడి ఇండియా!
సింగిల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు.. కొత్త ఈవీని విడుదల చేసిన ఆడి ఇండియా!

సింగిల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు.. కొత్త ఈవీని విడుదల చేసిన ఆడి ఇండియా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2023
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ దేశీయ మార్కెట్‌లో దూసుకెళ్తుతోంది. ఆ సంస్థ సరికొత్త ఈవీ మోడల్స్ ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని నెలల్లోనే ఇండియాలో ఈ మోడల్స్‌ను విడుదల చేయడం విశేషం. నాలుగు రకాల వేరియంట్లలో లభించనున్న ఈ మోడల్‌లో 50 ఈ- ట్రాన్ ధరను రూ. 1.13 కోట్లు, స్పోర్ట్ బ్యాక్ 55 ఈ- ట్రాన్ ధరను రూ.1.18 కోట్లు, 55 ఈ-ట్రాన్ ధర రూ.1.26 కోట్లు, టాప్ ఎండ్ క్యూ8 స్పోర్ట్స్ బ్యాక్ వెర్షన్ ధరను రూ.1.30 కోట్లుగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Details

ప్రయాణికుల భద్రత కోసం 8 ఎయిర్ బ్యాగులు

114 కిలోవాట్ అవర్ పెద్ద బ్యాటరీ కలిగిన క్యూ8 ఈ-ట్రాన్ ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం 5.6 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. ఇందులో క్యూ8 50 వెర్షన్ 95 కిలోవాట్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేయడం ద్వారా 505 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అదే విధంగా 6 సెకన్లలోనే గంటలకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసం కారులో 8 ఎయిర్ బ్యాగులు ఉండనున్నాయి. కాంప్లిమెంటరీ కింద 10 ఏండ్ల రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌, ఐదేండ్ల వ్యారెంటీ ఉండనుంది.