LOADING...
7 Seater Cars: రూ.5.65 లక్షలకే 7-సీటర్ కారు.. బెస్ట్ బడ్జెట్ మోడళ్లు ఇవే!
రూ.5.65 లక్షలకే 7-సీటర్ కారు.. బెస్ట్ బడ్జెట్ మోడళ్లు ఇవే!

7 Seater Cars: రూ.5.65 లక్షలకే 7-సీటర్ కారు.. బెస్ట్ బడ్జెట్ మోడళ్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో 7-సీటర్ కార్లకు ఎప్పటికప్పుడు మంచి డిమాండ్‌ కొనసాగుతోంది. పెద్ద కుటుంబాలు, ఎక్కువ మంది ప్రయాణికులతో తరచుగా ప్రయాణించే వారికి ఈ వాహనాలు అనువైన ఎంపికగా నిలుస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ సీటింగ్ సామర్థ్యం, మెరుగైన మైలేజ్‌, ఆధునిక ఫీచర్లతో ప్రస్తుతం పలు 7-సీటర్ మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యంత సరసమైన ఐదు కార్ల వివరాలు ఇవి.

వివరాలు

1. నిస్సాన్ గ్రావిటీ (Nissan Gravity)

ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభించే 7-సీటర్ కార్లలో నిస్సాన్ గ్రావిటీ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్‌-షోరూమ్ ధర రూ.5.65 లక్షలు. ఈ కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ ఏసీ వెంట్స్, డ్యాష్‌క్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ABS విత్ EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

వివరాలు

2. రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber)

బడ్జెట్ 7-సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో రెనాల్ట్ ట్రైబర్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ.5.76 లక్షలు (ఎక్స్‌-షోరూమ్). 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు 72 PS పవర్‌, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‌, ఎలక్ట్రిక్ ORVMలు, డే/నైట్ IRVM వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

Advertisement

వివరాలు

3. మహీంద్రా బొలెరో (Mahindra Bolero)

గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత నమ్మకమైన వాహనంగా గుర్తింపు పొందిన మహీంద్రా బొలెరో ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ప్రీమియం సీటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 1.5 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ 75 bhp పవర్‌, 210 Nm టార్క్‌ను అందిస్తుంది. 4. మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo) మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ.8.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్). ఇందులో 1.5 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్ 100 bhp పవర్‌, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు పలు ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

వివరాలు

5. మారుతి ఎర్టిగా (Maruti Ertiga)

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్ MPVలలో మారుతి ఎర్టిగా ఒకటి. దీని ప్రారంభ ధర రూ.8.80 లక్షలు (ఎక్స్‌-షోరూమ్). ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కుటుంబ అవసరాలకు అనుగుణంగా విశాలమైన క్యాబిన్‌, మెరుగైన మైలేజ్‌, ప్రయాణ సౌకర్యాలను అందిస్తుంది.

వివరాలు

ఏ కారు బెస్ట్?

తక్కువ బడ్జెట్‌లో 7-సీటర్ కారు కొనాలనుకునే వారికి రెనాల్ట్ ట్రైబర్ ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. బలమైన నిర్మాణం, గ్రామీణ రోడ్లపై మెరుగైన పనితీరు కోరుకునేవారికి మహీంద్రా బొలెరో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వినియోగం, సౌకర్యవంతమైన ప్రయాణం, మంచి మైలేజ్ పరంగా చూస్తే మారుతి ఎర్టిగా అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

Advertisement