Loading...
BYD Denza Z9 GT: 5 నిమిషాల్లో 70 శాతం ఛార్జింగ్‌.. భారత్‌కు వస్తున్న Denza Z9 GT!
5 నిమిషాల్లో 70 శాతం ఛార్జింగ్‌.. భారత్‌కు వస్తున్న Denza Z9 GT!

BYD Denza Z9 GT: 5 నిమిషాల్లో 70 శాతం ఛార్జింగ్‌.. భారత్‌కు వస్తున్న Denza Z9 GT!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD తన లగ్జరీ కార్ బ్రాండ్ Denzaను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ బ్రాండ్ భారత్‌లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన Denza Z9 GTకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక సాంకేతికత, లగ్జరీ ఫీచర్లు, శక్తివంతమైన ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్‌తో ఈ కారు ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచుతోంది. ఈ కారు ప్రత్యేకతల్లో ముఖ్యమైనది దాని డ్రైవింగ్ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 599 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది.

వివరాలు

Denza Z9 GT టీజర్ విడుదల

అంతేకాకుండా BYD అందించే 1500 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 5 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని పేర్కొంది.

మరి ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు డిజైన్, ఫీచర్లు, భద్రత, పనితీరు గురించి తెలుసుకుందాం. Denza విడుదల చేసిన టీజర్ నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, అందులో కనిపించిన వివరాలు కారు ప్రత్యేకతలను తెలియజేస్తున్నాయి.

LED హెడ్‌ల్యాంప్స్, విభిన్నమైన బూట్‌లిడ్ డిజైన్ ఆధారంగా ఇది Denza Z9 GT అని తెలుస్తోంది. ఈ కారులో 'Boost Mode' అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా అందించారు.

వేగంగా యాక్సిలరేషన్ అవసరమైనప్పుడు కొంత సమయం పాటు అదనపు పవర్‌ను అందించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

వివరాలు

షూటింగ్ బ్రేక్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణ

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ సదుపాయం భారత వెర్షన్‌లోనూ ఉండే అవకాశం ఉంది.

అలాగే 'Fjord Green' అనే ప్రత్యేకమైన డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్ కూడా ఈ కారుకు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందించనుంది.

Denza Z9 GT కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఒకటి. యూరప్‌కు చెందిన లగ్జరీ కార్లకు పోటీ ఇచ్చేలా దీనిని రూపొందించారు.

Denza Z9 GT డిజైన్‌లో ప్రధాన ఆకర్షణ దాని షూటింగ్ బ్రేక్ (Shooting Brake) బాడీ స్టైల్. స్పోర్టీగా కనిపించే స్లీక్ రూఫ్‌లైన్, ఆకర్షణీయమైన LED లైటింగ్, ప్రత్యేకమైన వెనుక భాగం డిజైన్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

లగ్జరీ ఇంటీరియర్.. అదిరిపోయే ఫీచర్లు

సాధారణ సెడాన్ కార్లతో పోలిస్తే దీని డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది. స్పోర్టీ లుక్‌తో పాటు లగ్జరీ అనుభూతిని అందించేలా దీన్ని తీర్చిదిద్దారు.

Denza Z9 GTలో ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం ఇంటీరియర్‌ను అందించారు. ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ అనేక అధునాతన ఫీచర్లను ఇందులో చేర్చారు.

రెండు ప్రత్యేకమైన రిఫ్రిజిరేటర్లు.

డిజిటల్ సైడ్ మిర్రర్లు.

1150W పవర్‌తో కూడిన 20 స్పీకర్ల DEVIALET సౌండ్ సిస్టమ్.

ముందు సీట్లకు 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్.

సీట్ హీటింగ్, వెంటిలేషన్ సదుపాయాలు.

10-పాయింట్ మసాజ్ ఫంక్షన్.

యాక్టివ్ సైడ్ బోల్స్టర్ సపోర్ట్.

ADVERTISEMENT

వివరాలు

భద్రతకు పెద్దపీట.. 180 కిలోమీటర్ల వేగంలోనూ స్థిరత్వం

డిస్‌ప్లేల విషయానికి వస్తే.. ఇందులో 17.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ముందు ప్రయాణికుడి కోసం 13.2 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి.

వీటితో పాటు ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు 50W వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లను కూడా అందించారు.

ప్రయాణికుల భద్రత కోసం Denza Z9 GTలో అనేక ఆధునిక సేఫ్టీ ఫీచర్లను అందించారు.

ఇందులో Level 2+ ADAS (Advanced Driver Assistance Systems), మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, వివిధ ఎలక్ట్రానిక్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కారులోని Vehicle Motion Control (VMC) సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వివరాలు

మూడు ఎలక్ట్రిక్ మోటార్లు.. 1156 PS పవర్

అధిక వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో టైర్ అకస్మాత్తుగా పేలినా వాహనంపై నియంత్రణ కోల్పోకుండా ఉండేందుకు ఈ టెక్నాలజీ సహాయపడుతుంది.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు కూడా టైర్ పంక్చర్ లేదా బ్లోఅవుట్ సంభవిస్తే వాహన స్థిరత్వాన్ని కాపాడేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

Denza Z9 GT అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ (EV), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వెర్షన్లలో అందుబాటులో ఉంది.

అయితే భారత మార్కెట్లో మాత్రం ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి.

వివరాలు

2.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం

ఇవి కలిపి 1156 PS పవర్, 1210 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. AWD (All-Wheel Drive) సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది.

దీంతో ఈ కారు అద్భుతమైన వేగం, పర్ఫార్మెన్స్‌ను అందించనుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కేవలం 2.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

దీని గరిష్ట వేగం గంటకు 270 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. ఇందులో 63.82 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు.

WLTP ప్రమాణాల ప్రకారం ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 599 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగలదని కంపెనీ వెల్లడించింది.

ADVERTISEMENT