NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Toyota Camry: భారత్ మార్కెట్లోకి 9వ తరం టయోటా కమ్రీ.. ధర రూ.48 లక్షల నుండి ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    Toyota Camry: భారత్ మార్కెట్లోకి 9వ తరం టయోటా కమ్రీ.. ధర రూ.48 లక్షల నుండి ప్రారంభం 
    భారత్ మార్కెట్లోకి 9వ తరం టయోటా కమ్రీ.. ధర రూ.48 లక్షల నుండి ప్రారంభం

    Toyota Camry: భారత్ మార్కెట్లోకి 9వ తరం టయోటా కమ్రీ.. ధర రూ.48 లక్షల నుండి ప్రారంభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2024
    03:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ అయిన టయోటా కిర్లోస్కర్, భారత్‌లో తన ప్రఖ్యాత సెడాన్ మోడల్ కారు కమ్రీ(Toyota Camry)అప్‌డేటెడ్ వర్షన్‌ను లాంచ్ చేసింది.

    ఈ కొత్త వర్షన్ ధర రూ.48 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో సేఫ్టీ ఫీచర్లతో పాటు కొత్తగా అదనపు ఫీచర్లు,ఇంటీరియర్ డిజైన్, న్యూ ఎక్స్‌టీరీయర్ స్టైల్‌ను కలిపి మరింత ఆకట్టుకునేలా రూపొందించారు.

    గత మోడల్ కంటే ఈ కారు మైలేజీ మెరుగ్గా ఉన్నప్పటికీ ధర కూడా రూ.1.83లక్షలు పెరిగింది.

    ఆసక్తి కలిగిన కస్టమర్లు తమ సమీప డీలర్ ద్వారా లేదా టయోటా ఆన్‌లైన్ ప్రీ బుకింగ్ పద్దతిలో తమ బుకింగ్స్ చేసుకోవాలని టయోటా కిర్లోస్కర్ సూచించింది.

    తక్షణమే కార్ల డెలివరీ ప్రారంభం కానున్నట్లు టయోటా కిర్లోస్కర్ తెలిపింది.

    వివరాలు 

    లీటర్ పెట్రోల్ పై 25 కి.మీ. మైలేజీ

    న్యూ టయోటా కమ్రీ 9వ జనరేషన్ మోడల్, టీఎన్జీఏ-కే ప్లాట్‌ఫామ్‌పై తయారైనది.

    ఈ కారు డిజైన్‌కు లెక్సస్, అల్‌ఫార్డ్, స్లెన్నా, వెంజా, లెక్సస్ ఈఎస్, లెక్సస్ ఆర్ఎక్స్ వంటి ప్రీమియం మోడల్ కార్ల ప్రభావం కనిపిస్తుంది.

    5వ జనరేషన్ హైబ్రీడ్ సిస్టమ్ (T-HS-5) 2.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఈ కారు గరిష్టంగా 230 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    ఈ ఇంజిన్ లీటర్ పెట్రోల్ పై 25 కి.మీ. మైలేజీని అందిస్తుంది.ఈ-సీవీటీ గేర్ బాక్స్‌తో కూడి ఉంటుంది.

    ఫ్రంట్‌లో, ఈ కారు న్యూ హెడ్ ల్యాంప్ డిజైన్, బ్లాక్ ఎలిమెంట్‌తో ఇంటిగ్రేటెడ్ హానీ కాంబ్ ప్యాటర్న్ గ్రిల్, స్లోప్డ్ రూఫ్ లైన్స్, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్,రేర్ బంపర్‌ను కలిగి ఉంటుంది.

    వివరాలు 

    ఆధునిక ఫీచర్లు

    ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 7.0 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నైన్ స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హెచ్‌యూడీ డిస్‌ప్లే, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 10-వే పవర్డ్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

    వివరాలు 

    ఇతర ప్రీమియం మోడల్ కార్లతో పోటీ

    సేఫ్టీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, టయోటా కమ్రీ 9వ జనరేషన్ కారులో సేఫ్టీ సెన్స్ 3.0 అడాస్ సూట్, ప్రీ-కొలిజన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రోడ్ సైన్ రికగ్నిషన్, ఆటోమేటిక్ హై బీమ్, 9-ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్, బ్యాక్ పార్కింగ్ సెన్సర్లు, 360-డిగ్రీ కెమెరా వంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

    ఈ కారు, స్కోడా సూపర్బ్, ఆడి ఏ4, మెర్సిడెజ్ సీ-క్లాస్, బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమౌసిన్ వంటి ఇతర ప్రీమియం మోడల్ కార్లతో పోటీ పడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆటో మొబైల్

    Ford: 2 సంవత్సరాల తర్వాత చెన్నైలో ఫోర్డ్ ఇండియా ప్లాంట్ రీ ఓపెన్..!  ఆటోమొబైల్స్
     Hill Hold Control: హిల్ హోల్డ్ కంట్రోల్ అంటే ఏమిటి? దీని ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి..! ఆటోమొబైల్స్
    Tata Nexon CNG vs Maruti Suzuki Brezza CNG:ఈ రెండు సీఎన్జీ కార్లలో ఏది కొంటే బెటర్..మైలేజ్‌లో ఏది టాప్? ఆటోమొబైల్స్
    Oben Rorr: ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేసి ఐఫోన్‌ను గెలుచుకొండి.. ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025