
Tata Nano: బైకు ధరకే బ్రాండ్ న్యూ కారు.. మళ్లీ రాబోతున్న 'టాటా నానో'
ఈ వార్తాకథనం ఏంటి
సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకీ కార్ల ధరలు పెరిగిపోతుండటంతో చాలామంది ఈ కలను వాయిదా వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ కలను నిజం చేయడానికి టాటా మోటార్స్ ముందుకొస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న టాటా నానో మళ్లీ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. అది కూడా అత్యంత చవక ధరకు.
Details
రూ. 1.45 లక్షలకే కారు?
కొన్నేళ్ల క్రితం రూ.1 లక్షకే అందుబాటులోకి వచ్చిన టాటా నానో ఇప్పుడు మళ్లీ రానుంది. తాజా సమాచారం ప్రకారం, టాటా నానో 2025 మోడల్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.2.80 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రవేశ ప్రమాణ ట్రిమ్‌లు రూ. 1.45 లక్షలకే లభించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Details
మైలేజ్, డిజైన్ అదిరిపోయేలా..
ఈ కొత్త నానో కారుకు 40 కిలోమీటర్ల మైలేజ్ ఉండనుందని తెలుస్తోంది. ఇది ముఖ్యంగా నగర వాహనదారులకు, మొదటిసారి కారు కొంటున్న వారికి చాలా అనుకూలం. శరీర ఆకృతిలోనూ పెద్ద మార్పులు చేస్తూ, కొత్త నానోను ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లాగా తీర్చిదిద్దారు. షడ్భుజి గ్రిల్, LED హెడ్‌ల్యాంపులు, డే టైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఆకర్షణీయ డిజైన్. బోల్డ్ అల్లాయ్ వీల్స్, కొత్త కలర్ ఆప్షన్లు మరింత ఆకర్షణీయతను కలిగిస్తున్నాయి.
Details
టెక్నికల్ స్పెసిఫికేషన్లు
ఇంజిన్: 624cc ట్విన్ సిలిండర్ పెట్రోల్ పవర్: 38PS టార్క్: 51Nm ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ మాన్యువల్ గ్రౌండ్ క్లియరెన్స్ : 180mm పొడవు : 3.1 మీటర్లు భవిష్యత్తులో టర్బో పెట్రోల్, CNG, పూర్తి ఎలక్ట్రిక్ వేరియంట్లు కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. EV మోడల్ 250 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని అంచనా. దీని ధర రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు.
Details
ఇంటీరియర్, ఫీచర్ల దుమ్ము దులుపుతాయ్
కారులో పలు ఆధునిక సదుపాయాలు ఉన్నాయి 7 అంగుళాల టచ్‌స్క్రీన్ (Android Auto, Apple CarPlay) డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్, USB, AUX పోర్ట్స్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సన్‌రూఫ్, కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్లు భద్రతా ఫీచర్లు కూడా కంఫ్రమైజ్ కాదు 4 ఎయిర్‌బ్యాగ్స్, ABS + EBD ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా బలమైన స్టీల్ బాడీ షెల్ ESC, సీట్‌బెల్ట్ రిమైండర్లు సైడ్ ఇంపాక్ట్ బీమ్‌లు చిన్న బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు, ఆకర్షణీయ లుక్స్, శ్రేష్ఠమైన మైలేజ్ - ఈ ముగ్గురి కలయికగా టాటా నానో 2025 భారత మార్కెట్‌లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది.