LOADING...
Audi SQ8: స్పోర్టీ లగ్జరీకి కొత్త డెఫినిషన్.. ఆడి SQ8 భారత్‌లో విడుదల, ధర రూ.1.77 కోట్లు
స్పోర్టీ లగ్జరీకి కొత్త డెఫినిషన్.. ఆడి SQ8 భారత్‌లో విడుదల, ధర రూ.1.77 కోట్లు

Audi SQ8: స్పోర్టీ లగ్జరీకి కొత్త డెఫినిషన్.. ఆడి SQ8 భారత్‌లో విడుదల, ధర రూ.1.77 కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా మార్కెట్లో తన పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ అయిన ఆడి ఎస్క్యూ8ను అధికారికంగా విడుదల చేసింది. ఈ వాహనం ప్రారంభ ఎక్స్‌-షోరూమ్ ధర రూ.1,77,72,000గా నిర్ణయించారు. ఆడి SQ8 హై-పెర్ఫార్మెన్స్ లగ్జరీ SUVగా నిలుస్తూ స్టైల్, పవర్, కంఫర్ట్‌ను సమపాళ్లలో అందిస్తుంది. ఇది స్టాండర్డ్ Q8 కంటే ఎక్కువ శక్తివంతంగా ఉండగా, ఆడి ఆర్ఎస్ క్యూ8 కంటే కొద్దిగా తక్కువ పవర్‌తో మధ్యస్థ స్థాయిలో ఉంటుంది. ఈ వాహనం 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తూ 507 హార్స్‌పవర్, 770 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Details

ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

ఇదే ఇంజన్‌ను RS Q8లో కూడా ఉపయోగించినప్పటికీ, SQ8కు అనుగుణంగా ప్రత్యేకంగా ట్యూన్ చేశారు ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఆడి ప్రత్యేకమైన క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జత చేశారు. ఈ వ్యవస్థ మలుపులు తిరిగేటప్పుడు కూడా అద్భుతమైన రోడ్ గ్రిప్, నియంత్రణను అందిస్తుంది.

Details

డిజైన్‌లో స్పోర్టీ లుక్

ఆడి ఎస్‌క్యూ8ను కూపే-స్టైల్ SUVగా రూపొందించారు. సాధారణ SUVలతో పోలిస్తే ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో హానీకోంబ్ ప్యాటర్న్‌తో పెద్ద గ్రిల్, ముదురు రంగు అంశాలు కారుకు స్పోర్టీ టచ్ ఇస్తాయి. సొగసైన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఆకర్షణీయమైన బంపర్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు దీని దూకుడు రూపాన్ని మరింత పెంచుతాయి. పక్కల వైపున వాలుగా ఉండే రూఫ్‌లైన్, బలమైన షోల్డర్ లైన్లు, S-స్పెసిఫిక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ డీటైలింగ్‌తో ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి. వెనుక భాగంలో LED లైట్ బార్, నాలుగు ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు, డిఫ్యూజర్-స్టైల్ బంపర్, చిన్న రూఫ్ స్పాయిలర్‌తో స్పోర్టీ ఫినిషింగ్ ఇచ్చారు.

Advertisement

Details

ఇంటీరియర్స్, ఫీచర్లు

వాహనం లోపల డ్రైవర్‌కు అనుకూలంగా అన్ని కంట్రోల్స్ అమర్చారు. ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, హై-స్పీడ్ డ్రైవింగ్‌కు అనువైన స్పోర్ట్స్ సీట్లు ఇందులో ఉన్నాయి. ఈ సీట్లకు ప్రీమియం లెదర్, నాణ్యమైన స్టిచింగ్ ఫినిషింగ్ అందించారు. క్యాబిన్‌లో యాంబియంట్ లైటింగ్ ఉండి, దానిని వినియోగదారులు తమ ఇష్టానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. సేఫ్టీ పరంగా కూడా SQ8 బలంగా ఉంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు,ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 360-డిగ్రీ కెమెరా, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఆధునిక భద్రతా సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఆడి SQ8, లగ్జరీతో పాటు పెర్ఫార్మెన్స్ కోరుకునే కస్టమర్లకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.

Advertisement