Page Loader
Citroën C3 Sport Edition: బెస్ట్ సెల్లింగ్ SUVలో కొత్త ఎడిషన్ వచ్చేసింది.. ధర రూ. 6.5 లక్షలలోపే!
బెస్ట్ సెల్లింగ్ SUVలో కొత్త ఎడిషన్ వచ్చేసింది.. ధర రూ. 6.5 లక్షలలోపే!

Citroën C3 Sport Edition: బెస్ట్ సెల్లింగ్ SUVలో కొత్త ఎడిషన్ వచ్చేసింది.. ధర రూ. 6.5 లక్షలలోపే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో బెస్ట్‌ సెల్లింగ్‌ ఎస్‌యూవీగా గుర్తింపు పొందిన Citroën C3కి కొత్త ఎడిషన్‌ వచ్చింది. దీని పేరే Citroën C3 Sport Edition. ఈ లిమిటెడ్ ఎడిషన్‌ SUV ధర రూ. 6.44 లక్షల (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించారు. ఇది స్టాండర్డ్ C3 మోడల్‌కు మించి స్పోర్టీ డిజైన్, కొత్త రంగు, ప్రత్యేక యాక్సెసరీలతో రూపొందించారు. యువతకు ఆకర్షణీయంగా ఉండేలా Citroën ఈ వాహనాన్ని రూపొందించింది.

Details

సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్ 

ధరలో తేడా సీ3 స్పోర్ట్ ఎడిషన్ స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 21,000 ఎక్కువగా ఉంటుంది. అదనంగా డాష్‌క్యామ్, వైర్‌లెస్‌ చార్జర్ కలిగిన టెక్ కిట్‌కి రూ. 15,000 ఉంటుంది. విలక్షణమైన స్టైలింగ్ బాడీపై 'SPORT' డెకాల్స్ కొత్త Garnet Red ఎక్స్‌టీరియర్ కలర్ (C3 లైన్‌ప్‌లో తొలిసారి) స్పోర్టీ థీమ్‌ కస్టమ్ సీట్ కవర్లు Citroën రేస్-ప్రేరిత పెడల్స్ సీట్‌బెల్ట్ కుషన్లు యాంబియంట్ క్యాబిన్ లైటింగ్ - రాత్రి డ్రైవ్‌లో మెరుగైన అనుభవం

Details

ఇంటీరియర్ & ఫీచర్లు 

స్పోర్ట్ ఎడిషన్‌లో Ambient lighting, ప్రత్యేకమైన ఫ్లోర్ మ్యాట్స్, స్పోర్ట్-ఫోకస్‌డ్ సీటింగ్ సిస్టమ్ 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్ కిట్ ద్వారా డాష్‌క్యామ్, వైర్‌లెస్ ఛార్జర్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇంజిన్ & పెర్ఫార్మెన్స్ C3 స్పోర్ట్ ఎడిషన్ రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది 1. 1.2 లీటర్ PureTech 82 NA ఇంజిన్ పవర్: 81 bhp టార్క్: 115 Nm గేర్‌బాక్స్: 5-Speed Manual

Details

2. 1.2 లీటర్ PureTech 110 Turbocharged ఇంజిన్

పవర్: 108 bhp టార్క్: 205 Nm గేర్‌బాక్స్: 6-Speed Manual / 6-Speed Automatic మైలేజ్ 18.3 kmpl నుంచి 19.3 kmpl వరకు ఇంధన సామర్థ్యం టర్బో ఆటోమేటిక్ వేరియంట్‌ కేవలం 10 సెకన్లలో 100 కిమీ వేగాన్ని చేరగలదు/ Citroën C3 Sport Edition అనేది స్టైలింగ్, ఫీచర్లు, పెర్ఫార్మెన్స్. స్పోర్టీ లుక్‌కి ఇష్టపడే వారి కోసం ఇది ప్రత్యేకమైన ఎంపికగా నిలుస్తోంది. లిమిటెడ్ ఎడిషన్ కావడంతో కొనుగోలు చేయాలనుకునే వారు త్వరపడడం మంచిది.