Loading...
Toyota Fortuner Leader Edition : టయోటా ఫార్చ్యూనర్‌లో కొత్త ఎడిషన్ వచ్చేసింది.. బ్లాక్ లుక్‌తో అదుర్స్!
టయోటా ఫార్చ్యూనర్‌లో కొత్త ఎడిషన్ వచ్చేసింది.. బ్లాక్ లుక్‌తో అదుర్స్!

Toyota Fortuner Leader Edition : టయోటా ఫార్చ్యూనర్‌లో కొత్త ఎడిషన్ వచ్చేసింది.. బ్లాక్ లుక్‌తో అదుర్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) భారత మార్కెట్లో తన ఫేమస్ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్‌లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. 2026 Toyota Fortuner Leader Edition పేరుతో ఈ కొత్త ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా డిజైన్‌లో మార్పులతో పాటు రోజువారీ వినియోగానికి ఉపయోగపడే కొన్ని అదనపు ఫీచర్లను అందించింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.36.51 లక్షలుగా నిర్ణయించింది. 4x2 మాన్యువల్, 4x2 ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఈ కారు బుకింగ్స్ అక్టోబర్ 12, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

వివరాలు

Toyota Fortuner Leader Edition: డిజైన్‌లో మార్పులు

కొత్త ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌లో ప్రధానంగా బాహ్య రూపానికి సంబంధించిన మార్పులపై టయోటా దృష్టి సారించింది.

ఇందులో రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, గ్లాస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, వాటికి సరిపోయే హబ్ క్యాప్స్‌ను అందించింది.

వెనుక డోర్లపై బ్లాక్ గార్నిష్, బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన యాంటెన్నా ఉన్నాయి. వీటితో పాటు బ్లాక్ రూఫ్, బాడీ సైడ్ మోల్డింగ్స్ వాహనానికి ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తాయి.

బానెట్‌పై ప్రత్యేకంగా రూపొందించిన ఎంబ్లమ్ కూడా ఈ ఎడిషన్‌లో మరో ఆకర్షణగా నిలుస్తుంది.

ఈ మార్పుల వల్ల సాధారణ ఫార్చ్యూనర్‌తో పోలిస్తే లీడర్ ఎడిషన్ విభిన్నంగా కనిపిస్తుంది.

వివరాలు

ఇంటీరియర్‌లోనూ కొత్త హంగులు

కారు లోపలి భాగంలో బ్లాక్, మెరూన్ రంగుల కలయికతో కూడిన సీటు అప్‌హోల్స్టరీని అందించారు. డోర్ ట్రిమ్స్‌లోనూ ఇదే రంగుల కలయిక కనిపిస్తుంది.

క్యాబిన్‌కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందించేందుకు యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లను జోడించారు.

ఇక అదనపు ఫీచర్ల విషయానికొస్తే.. ఆటో-ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్లు (ORVMs), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫీచర్లు డ్రైవింగ్ సమయంలో సౌకర్యాన్ని పెంచడంతో పాటు టైర్లలో గాలి ఒత్తిడిని పర్యవేక్షించేందుకు ఉపయోగపడతాయి.

అయితే కారు లోపలి లేఅవుట్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు.

ADVERTISEMENT

వివరాలు

Toyota Fortuner Leader Edition 2026 ధరలు

మాన్యువల్ వేరియంట్‌తో పోలిస్తే ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.2.21 లక్షలు ఎక్కువగా ఉంది.

రెండు వేరియంట్లలోనూ వెనుక చక్రాలకు శక్తిని అందించే రియర్-వీల్ డ్రైవ్ (4x2) వ్యవస్థనే అందించారు. లీడర్ ఎడిషన్‌లో ప్రస్తుతం 4x4 ఆప్షన్‌ను ప్రకటించలేదు.

ఈ కొత్త ఎడిషన్‌లో ఇంజిన్, గేర్‌బాక్స్ లేదా పనితీరుకు సంబంధించిన మార్పులను టయోటా ప్రకటించలేదు.

అందువల్ల ఇది ప్రధానంగా డిజైన్, అదనపు పరికరాల ఆధారంగా తీసుకొచ్చిన అప్‌డేట్‌గా నిలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

మూడు రంగుల్లో లభ్యం

టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను మూడు ఎక్స్‌టీరియర్ రంగుల్లో అందిస్తోంది.

సూపర్ వైట్ (Super White)

ప్లాటినం వైట్ పెర్ల్ (Platinum White Pearl)

ఆటిట్యూడ్ బ్లాక్ (Attitude Black)

కొత్త డిజైన్ హంగులతో పాటు ఈ రంగుల ఎంపిక ద్వారా వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

వివరాలు

కొనుగోలుదారులకు ఫైనాన్స్, వారంటీ ప్రయోజనాలు

ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ కొనుగోలుదారుల కోసం టయోటా పలు ఫైనాన్స్ సదుపాయాలను కూడా అందిస్తోంది.

ఏడేళ్ల వరకు ఫైనాన్స్ ఆప్షన్లతో పాటుSmart Balloon Financeపథకాన్ని అందుబాటులో ఉంచింది. అలాగే ఐదేళ్ల పాటు ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను అందిస్తోంది.

వాహనానికి మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్లు — ఏది ముందుగా పూర్తయితే అంతవరకు ప్రామాణిక వారంటీ వర్తిస్తుంది.

అదనంగా ఐదేళ్లు లేదా 2.20 లక్షల కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని పొందే అవకాశం ఉంది.

మొత్తంగా 2026 Toyota Fortuner Leader Editionలో కొత్త డిజైన్, అదనపు సౌకర్యవంతమైన ఫీచర్లను కోరుకునే వినియోగదారులను ఆకర్షించడమే టయోటా లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే ఇంజిన్, పనితీరులో మార్పులు లేకపోవడంతో ఇది ప్రధానంగా స్టైలింగ్ అప్‌డేట్‌గా నిలుస్తుంది.

ADVERTISEMENT