LOADING...
BMW i3: ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌లో నూతన మైలురాయి.. ఒక్క ఛార్జ్‌తో 800కిమీ రేంజ్
ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌లో నూతన మైలురాయి.. ఒక్క ఛార్జ్‌తో 800కిమీ రేంజ్

BMW i3: ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌లో నూతన మైలురాయి.. ఒక్క ఛార్జ్‌తో 800కిమీ రేంజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ ఆటోమెకర్ బీఎండబ్ల్యూ తన 3 సిరీస్ ఫ్యామిలీకి తొలి పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ i3ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ కొత్త మోడల్ 2023లో ప్రదర్శించబడిన Vision Neue Klasse కాన్సెప్ట్‌పై ఆధారపడి, ప్రత్యేకంగా రూపొందించిన Gen6 ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడనుంది. కంపెనీ ఈ కొత్త i3 మోడల్ 'అత్యుత్తమ డ్రైవింగ్ ప్లెజర్' ను అందించనుందని, ఒకే ఛార్జ్‌లో 800 కిలోమీటర్ల పైగా రేంజ్ కలిగిస్తుందని హామీ ఇచ్చింది.

Details

Tesla, Xpeng, Denza వంటి బ్రాండ్లతో పోటీ 

i3, BMWకి Tesla మరియు చైనీస్ ప్రీమియం ఎలక్ట్రిక్ బ్రాండ్లతో పోటీ చేసే కీలక ప్లేయర్‌గా నిలుస్తుందనే అంచనా. కారు వేరే వేరే పవర్ ఆప్షన్స్‌తో, హై-పర్‌ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ M3 వెర్షన్‌తో కూడా అందుబాటులో ఉండనుంది. ప్రారంభ మోడల్ 50 xDriveగా రాకూడగా ఉంది, ఇటీవల విడుదలైన iX3 SUV మాదిరిగానే ఈ వేరియంట్ 108kWh నికెల్ మ్యాంగనీస్-కోబాల్ట్ బ్యాటరీతో డ్యూయల్-మోటార్ సెటప్ ద్వారా గరిష్టంగా 464hp పవర్, 650Nm టార్క్ అందించగలదు. i3లో ఉపయోగించే Gen6 ప్లాట్‌ఫారమ్ 800V ఆర్కిటెక్చర్ కలిగి ఉంది. ఇది 400kW వేగంతో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే iX3 SUVలో కనిపించిన Panoramic iDrive సిస్టమ్‌ను కూడా అందిస్తోంది.

Details

పర్ఫార్మెన్స్, 'Heart of Joy' సిస్టమ్

BMWఇంజినీర్లు i3ను పెట్రోల్ 3 సిరీస్ మోడల్స్ స్థాయి రైడ్ మరియు హ్యాండ్లింగ్ అందించే విధంగా డిజైన్ చేశారు. కొత్త సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్, తక్కువ ప్రాసెసింగ్ చిప్స్‌తో, దీనికి కీలకమైన పాత్ర వహిస్తుంది. ఈ కొత్త సిస్టమ్‌లో'Heart of Joy'అనే ప్రధాన ఫీచర్ ఉంది, ఇది అన్ని డ్రైవింగ్ అనుభవం నియంత్రణలను కేంద్రీకృతంగా కలుపుతుంది. బ్రేకింగ్, ఎనర్జీ రికుపరేషన్ సిస్టమ్స్ కూడా దీనిలో భాగంగా ఉంటాయి. ఆటోమేటిక్‌గా మారుతూ గరిష్ట స్టాపింగ్ పవర్ అందిస్తాయి. BMW ప్రకారం, 98% రిటార్డేషన్ ఎనర్జీ రీజెనరేషన్ సిస్టమ్ ద్వారా చేయవచ్చని చెప్పారు. BMW i3 ఎలక్ట్రిక్ 3 సిరీస్, ఆధునిక టెక్నాలజీ, పవర్ మరియు ఎఫీషియన్సీని కలిపి, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో క్రాంతి సృష్టించబోతోంది