Page Loader
Hero HF Deluxe: రూ.73,550కే అదిరే బైక్‌.. కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో ఆవిష్కరణ!
రూ.73,550కే అదిరే బైక్‌.. కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో ఆవిష్కరణ!

Hero HF Deluxe: రూ.73,550కే అదిరే బైక్‌.. కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో ఆవిష్కరణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ద్విచక్ర వాహన పరిశ్రమలో అగ్రగామి సంస్థగా నిలిచిన హీరో మోటోకార్ప్, తాజాగా తన హెచ్ఎఫ్ డీలక్స్ శ్రేణిని మరింత బలోపేతం చేస్తూ కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో మోడల్‌ను లాంచ్ చేసింది. ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ విభాగంలో పోటీతత్వాన్ని పెంచేలా ఈ మోడల్ రూపుదిద్దుకుంది. ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, అద్భుతమైన మైలేజ్ అందించడంలో ఇది ముందంజలో నిలవనుంది. ఈ కొత్త బైక్‌లో ఐ3ఎస్ టెక్నాలజీ, లో ఫ్రిక్షన్ ఇంజిన్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, కొత్త గ్రాఫిక్స్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, 18 అంగుళాల వీల్స్ వంటి పలు ఆకర్షణీయమైన ఫీచర్లను పొందుపరిచారు. బైక్‌కు 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది.

Details

ఈ బైక్ ధర రూ. 73,550

ఇది 7.9 బిహెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హీరో మోటోకార్ప్ సీబీఓ అశుతోష్ వర్మ మాట్లాడుతూ హెచ్ఎఫ్ డీలక్స్ భారతవ్యాప్తంగా మిలియన్ల మంది కస్టమర్లకు నమ్మకమైన భాగస్వామిగా నిలిచింది. విశ్వసనీయత, మైలేజ్ విషయంలో ఇది ప్రామాణికంగా నిలుస్తోంది. తాజా 'హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో' ద్వారా యువతకు కావలసిన ఆధునిక ఫీచర్లు, బోల్డ్ డిజైన్ అందించామని తెలిపారు. ఈ మోడల్‌కు కంపెనీ ఎక్స్-షోరూమ్ ధర రూ.73,550గా నిర్ణయించింది.

Details

అత్యాధునిక ఫీచర్లు

ఇది ఇప్పటికే మంచి క్రేజ్ ఉన్న హీరో స్ప్లెండర్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా లాంటి మోడళ్లకు గట్టి పోటిగా నిలవనుంది. అత్యాధునిక డిజిటల్ స్పీడోమీటర్ సహా రియల్ టైమ్ రైడింగ్ డేటా, తక్కువ ఇంధన సూచిక (LFI), 130ఎంఎం వెనుక డ్రమ్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఈ బైక్‌ను రోజువారీ ప్రయాణాలకు మరింత సౌకర్యవంతంగా మార్చాయి. తక్కువ ధరలో విశ్వసనీయత, మైలేజ్, ఆధునిక ఫీచర్లను కోరుకునే రైడర్లకు ఇది సరైన ఎంపికగా నిలవనుంది.