LOADING...
Ola Sona weekend: అక్షయ తృతీయ స్పెషల్‌.. ఓలా సోనా వీకెండ్‌లో రూ.50 వేల వరకు ఆఫర్లు
అక్షయ తృతీయ స్పెషల్‌.. ఓలా సోనా వీకెండ్‌లో రూ.50 వేల వరకు ఆఫర్లు

Ola Sona weekend: అక్షయ తృతీయ స్పెషల్‌.. ఓలా సోనా వీకెండ్‌లో రూ.50 వేల వరకు ఆఫర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 18, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్షయ తృతీయ సందర్భంగా 'ఓలా' ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'ఓలా సోనా వీకెండ్' పేరుతో తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాలపై గరిష్టంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో కొత్త వాహనాల కొనుగోలుపై రూ.40 వేల వరకు ప్రయోజనాలు ఉండగా, అదనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, స్కాపియా ఫెడరల్, యస్ బ్యాంక్, ఐబీఐఎఫ్‌సీ, హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు వినియోగదారులకు రూ.10వేల అదనపు డిస్కౌంట్‌ కూడా అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆఫర్ల వివరాల్లో భాగంగా, జెన్‌ 3 ఎస్‌1 ఎక్స్‌ (2kWh), రోడ్‌స్టర్‌ ఎక్స్‌ (2.5 kWh) విద్యుత్ వాహనాలను ప్రారంభ ధర రూ.49,999కే అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

వివరాలు

8 సంవత్సరాల వరకు బ్యాటరీ వారంటీ

అలాగే Roadster X+ 9.1 kWh బైక్‌పై రూ.50 వేల భారీ తగ్గింపు ప్రకటించడంతో, ఈ మోడల్‌ను రూ.1,39,999కే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అదనంగా ఈ ఆఫర్‌లో కొనుగోలు చేసే అన్ని వాహనాలకు 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఈ రెండు రోజుల ఆఫర్‌లో వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు లక్కీ డ్రా నిర్వహించి, విజేతకు ప్రత్యేకంగా Ola Sona స్పెషల్ ఎడిషన్ బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే 4680 భారత్ సెల్‌తో రూపొందించిన Roadster X+ 9.1 మోడల్ కొనుగోలు గడువును కూడా పొడిగించినట్లు కంపెనీ తెలిపింది.

Advertisement