LOADING...
Electric Scooter: 200 కి.మీతో మార్కెట్‌ను షేక్ చేసే ఈ-స్కూటర్.. ధర ఎంతంటే?
200 కి.మీతో మార్కెట్‌ను షేక్ చేసే ఈ-స్కూటర్.. ధర ఎంతంటే?

Electric Scooter: 200 కి.మీతో మార్కెట్‌ను షేక్ చేసే ఈ-స్కూటర్.. ధర ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ భారత రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరీక్షిస్తోంది. ఈమోడల్‌కు సంబంధించిన స్పై ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ స్కూటర్ ఫీచర్లు, డిజైన్ ఎలా ఉండబోతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. కొత్త స్కూటర్ డిజైన్‌కు సింపుల్ ఎనర్జీ ఇప్పటికే కొన్ని నెలల క్రితం పేటెంట్ పొందింది. ప్రస్తుతం రోడ్ టెస్టింగ్ దశలో ఉండటం వల్ల ఈ ప్రోడక్ట్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.ఈ కొత్త మోడల్‌కు 'అరైవ్' అనే పేరు పెట్టే అవకాశం ఉందని సమాచారం. 'అరైవ్', 'సింపుల్ అరైవ్ ప్లస్', 'సింపుల్ అరైవ్+', 'అరైవ్+', 'అరైవ్ ప్లస్' వంటి పేర్లకు కంపెనీ ఇప్పటికే వర్డ్‌మార్క్‌లు కూడా నమోదు చేసింది.

వివరాలు

ఫ్యామిలీ స్కూటర్లకే ఎక్కువ డిమాండ్

ప్రస్తుతం సింపుల్ ఎనర్జీ భారత మార్కెట్లో 'వన్', 'వన్ ఎస్' అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి స్పోర్టీ డిజైన్‌తో ఉంటాయి. అయితే ఇప్పుడు పరీక్షిస్తున్న కొత్త స్కూటర్ మాత్రం వీటి కంటే పూర్తిగా భిన్నంగా, సింపుల్‌గా కనిపిస్తోంది. దీన్ని బట్టి కంపెనీ ఈసారి ఫ్యామిలీ యూజ్‌కు అనుకూలంగా ఉండే మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అర్థమవుతోంది. మార్కెట్లో ప్రస్తుతం స్పోర్టీ స్కూటర్ల కంటే ఫ్యామిలీ స్కూటర్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఏథర్ సంస్థ కూడా ఖరీదైన 450 సిరీస్‌కు భిన్నంగా, తక్కువ ధరలో అన్ని వర్గాల వారికి సరిపోయే 'రిస్టా' స్కూటర్‌ను తీసుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది.

వివరాలు

ఫీచర్లు ఇవే

దానికి పోటీగా టీవీఎస్ గత ఏడాది 'ఆర్బిటర్' మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కూడా ఇదే సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కొత్త స్కూటర్‌లో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్, పొడవైన ఫ్లాట్ సింగిల్ పీస్ సీటు, స్టోరేజ్ స్పేస్, TFT డిస్‌ప్లే, సింగిల్ పీస్ గ్రాబ్ రైల్, LED లైటింగ్ వంటి సదుపాయాలు ఉండే అవకాశం ఉంది. అయితే పవర్‌ట్రెయిన్, బ్యాటరీ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రస్తుత 'సింపుల్ వన్' లేదా 'వన్ ఎస్' స్కూటర్లలో ఉపయోగిస్తున్న బ్యాటరీ, మోటార్‌ను ఈ కొత్త మోడల్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

వివరాలు

గరిష్టంగా 190 కిలోమీటర్ల వరకు రేంజ్

'వన్ ఎస్' స్కూటర్‌లో 3.7 kWh బ్యాటరీ ఉండగా, ఇది గరిష్టంగా 190 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. వాస్తవ వినియోగంలో ఈ రేంజ్ 150 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. కొత్త స్కూటర్‌లో కూడా ఇదే స్థాయి రేంజ్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, కొంచెం తక్కువ సామర్థ్యం గల 2.0 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశమూ ఉంది. ధర విషయానికి వస్తే.. ఈ స్కూటర్‌ను సుమారు రూ. 1 లక్షలోపు ధరతో మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. మార్కెట్ ట్రెండ్ కూడా ఇదే సూచిస్తోంది. ఇక సింపుల్ ఎనర్జీ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది.

Advertisement