భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్
ఇటాలియన్ ఆటోమోటివ్ సంస్థ పియాజియో ఈ సంవత్సరం భారతదేశంలో వెస్పా, అప్రిలియా సబ్-బ్రాండ్‌ల క్రింద కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ జాబితాలో వెస్పా టూరింగ్, అప్రిలియా SR టైఫూన్ స్కూటర్‌లతో పాటు RS 440 మిడిల్ వెయిట్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ కూడా ఉన్నాయి. మహారాష్ట్రలోని బారామతిలో ఈ బైకులు టెస్ట్ రన్ లో ఉన్నాయి. ఏప్రిలియా , వెస్పా బ్రాండ్‌లకు భారతదేశంలో ఆదరణ పెరిగింది. ఇప్పుడు అప్రిలియా భారతదేశ మార్కెట్లో సరికొత్త సూపర్ స్పోర్ట్ ఆఫర్‌తో మిడిల్ వెయిట్ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది. వెస్పా భారత మార్కెట్ కోసం టూరింగ్ ఎడిషన్ మోడల్‌తో సిరీస్ అప్‌డేట్ చేసింది. ఇది 125cc, 150cc ఇంజిన్ ఆప్షన్‌లతో వస్తుంది.
ఎంట్రీ-లెవల్ మోడల్‌గా పరిచయం కానున్న టైఫూన్ 125
అప్రిలియా భారతదేశంలో కొత్త టైఫూన్ 125ని ఎంట్రీ-లెవల్ మోడల్‌గా పరిచయం కానుంది. ఇది అప్డేట్ అయిన OBD-II-కంప్లైంట్ 125cc ఇంజిన్ తో నడుస్తుంది.. అప్రిలియా RS 440 RS 660 లాంటి డిజైన్ తో వస్తుంది. మోటార్‌సైకిల్ సరికొత్త సబ్-400సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. అప్రిలియా టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్ స్కూటర్ల ధర దాదాపు రూ. 1 లక్ష కాగా, అప్రిలియా RS 440 ధర సుమారుగా రూ. 4 లక్షలు. టైఫూన్ 125 ఏప్రిల్ నాటికి , RS 440 సెప్టెంబరులో భారతదేశంలో ప్రారంభమవుతుంది.