Page Loader
భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నహోండా యాక్టివా
ఈ బైక్ కు కారు లాంటి స్మార్ట్ కీ ఉంటుంది

భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నహోండా యాక్టివా

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 23, 2023
06:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోండా తన యాక్టివా స్కూటర్‌లో స్మార్ట్ కీ వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ కు కారు లాంటి స్మార్ట్ కీ ఉంటుంది, ఇది మల్టీ ఫంక్షనల్ బటన్‌తో వస్తుంది. ఇందులో 5.3 లీటర్ల పెట్రోల్ స్టోర్ చేసుకోవచ్చు, ఇది 105 కిలోల బరువు ఉంటుంది. స్మార్ట్ కీ హోండా యాక్టివా స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే మరికొన్ని భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అయితే దాని డిజైన్ తో పాటు అన్నీ అంశాలు మిగిలిన మోడల్స్ లాగానే ఉంటాయి. మార్కెట్లో యమహా ఫాసినో, TVS జూపిటర్ కి పోటీగా ఉంటుంది. H-Smart అనే భద్రతా వ్యవస్థ ఇందులో ఉంది. స్మార్ట్ కీ దూరంగా వెళ్ళినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

బైక్

మల్టీఫంక్షనల్ రోటరీ నాబ్‌ తో బైక్ ను లాక్/అన్‌లాక్ చేయచ్చు

స్మార్ట్ కీ దగ్గరలో ఉన్నప్పుడు స్కూటర్‌ని అన్‌లాక్ చేయవచ్చు/స్టార్ట్ చేయవచ్చు, పెట్రోల్ క్యాప్ ను తెరవవచ్చు. మల్టీఫంక్షనల్ నాబ్‌ని ఉపయోగించి బూట్ స్పేస్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు. కీ దూరంగా వెళ్లినప్పుడు, దానికదే లాక్ అవుతుంది. కీలో 'ఫైండ్ మై వెహికల్' బటన్ కూడా ఉంది, ఇది నొక్కినప్పుడు స్కూటర్ ఫ్లాష్ చేస్తుంది, దానితో సులభంగా కనుక్కోవచ్చు. భారతదేశంలో జరిగే వాహన దొంగతనాలను పరిశీలిస్తే, ఈ భద్రతా వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశంలో, హోండా యాక్టివా స్మార్ట్ కీ వేరియంట్ ధర రూ. 80,537. స్టాండర్డ్ వేరియంట్‌ ధర రూ. 74,536, డీలక్స్ వేరియంట్‌ ధర రూ. 77,036(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). కొత్త మోడల్ డెలివరీలు జనవరి చివరి నాటికి ప్రారంభమవుతాయి.